English | Telugu
హాస్పిటల్ లో స్టార్ యాంకర్..కారణం తెలిస్తే షాక్ అవుతారు
Updated : Nov 14, 2024
యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన స్రవంతి చొక్కారపు(sravanthi chokarapu)కొన్ని సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే పొందింది.ప్రస్తుతం ఆమె అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది.ఈ విషయాన్ని తనే సామాజిక మాద్యమాల ద్వారా వెల్లడి చేసింది.
కేవలం ఆడవారి కోసం మాత్రమే ఈ పోస్ట్ చేస్తున్నాను. అసలు ఇలాంటి పోస్ట్ చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. గత ముప్పై, నలభై రోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్. డాక్టర్ ని కలిసే టైమ్ లేక స్కానింగ్ చేయించుకోలేదు. ఒక రోజు షూటింగ్ ఉదయం 6:45 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది.ఆ తర్వాత విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ ని సంప్రదించాను. అప్పుడు కానీ తెలిసి రాలేదు నాకొచ్చింది చిన్న సమస్య కాదని,దాంతో వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు హెల్త్ కంప్లీట్ గా రికవర్ అవ్వాలి ఇంతకు ముందు లాగా నడవాలంటే నాలుగు వారాల నుంచి ఐదు వారాల దాకా పడుతుందని డాక్టర్ చెప్పారు.
సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే. ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయిలు ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాం కాబట్టి హెల్త్ బాగోలేదని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో,ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి.అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరేహెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ వర్క్,షూట్స్ ఈవెంట్స్ అని హెల్త్ ని నెగ్లెట్ చెయ్యకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి అని ఇనిస్టాగ్రమ్ వేదికగా సుదీర్ఘ నోట్ రాసుకొచ్చింది.