English | Telugu

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ!

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ వంటి వెపన్స్ కలిగి ఉంటే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కొంతమంది తెలుగమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు. (Ananya Nagalla)

స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నటిగా మారారు అనన్య నాగళ్ళ.కెరీర్ ప్రారంభంలో 'షాదీ' వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంటనే 'మల్లేశం'తో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. వెంటనే 'ప్లే బ్యాక్' అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 'తంత్ర', 'పొట్టేల్', 'బహిష్కరణ'(వెబ్ సిరీస్), 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.

ఇదిలా ఉంటే.. అనన్య నాగళ్ళ ఇప్పుడు స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర', 'పొట్టేల్', 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది.

అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ళ బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు అనన్య నాగళ్ళ. ఈమె మెయిన్ లీడ్ గా ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.. అంటే ఈమె క్రేజ్, మార్కెట్ రాష్ట్రాలు దాటాయి అని అర్దం చేసుకోవచ్చు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.