English | Telugu

అనన్య నాగళ్ల అందాల ఆరబోత!

సినిమా అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలుగు నటి అనన్య నాగళ్ల కూడా ఈ సూత్రాన్ని నమ్ముతున్నట్టుగా ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఆమె హాట్ టాపిక్ గా మారింది. (Ananya Nagalla)

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు తక్కువ మందే ఉన్నారు. వారిలో అనన్య నాగళ్ల ఒకరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య.. మల్లేశం, వకీల్‌ సాబ్, తంత్ర, పొట్టేల్‌ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఎక్కువగా నటనకు ప్రాధాన్యముండే పాత్రలు చేసే అనన్య.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ తో కుర్రకారు మతి పోగొడుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా రెడ్ డ్రెస్ లో ఆమె ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

అనన్య ఈ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మునుముందు సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో అలరిస్తుందేమో చూడాలి.

గతేడాది విడుదలైన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమాలో నెగటివ్ రోల్ లో సర్ ప్రైజ్ చేసింది అనన్య నాగళ్ల.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.