English | Telugu

అల్లుఅర్జున్ పై అక్బరుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు 

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం,ఆ కేసులో అల్లు అర్జున్(allu arjun)అరెస్ట్ అయ్యి, ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చిన విషయం తెలిసిందే.రీసెంట్ గా ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)అసెంబ్లీ వేదికగా ఈ కేసు పై ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్ధం అవుతుంది.

రీసెంట్ గా అల్లుఅర్జున్ విషయంపై ఏంఐఏం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఏంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసి(akbaruddin owaisi)మాట్లాడుతు అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్నప్పుడు పక్కనున్నవాళ్ళు తొక్కిసలాట జరిగిందని చెప్పారు.అయితే మన సినిమా హిట్ అని అల్లుఅర్జున్ వాళ్ళతో అన్నాడు.తొక్కిసలాటలో మహిళ మృతి చెందినా కూడా అల్లు అర్జున్ సినిమాను చూసి వెళ్ళాడు.పైగా వెళ్ళేటప్పుడు బాధ్యత లేకుండా  అభిమానులకు చెయ్యి ఊపుతూ కూడా వెళ్ళాడు.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.