English | Telugu

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అల్లు అర్జున్ "బద్రీనాథ్"సినిమా చేస్తున్నప్పుడే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం కథ చెప్పారనీ, అందుకు అల్లు అర్జున్ తన వివాహం కాగానే ఈ చిత్రం గురించి ఆలోచిద్దామని త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చెప్పినట్లు సమాచారం. నిజానికి ఈ కథని త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా హీరో విక్టరీ వెంకటేష్ కి చెప్పగా ఆయనకి ఈ కథ నచ్చి ఈ మువీలో నటించటానికి అంగీకరించారట.

కానీ ఆయన తేజ దర్శకత్వంలో "సావిత్రి" సినిమా చేస్తూండటంతో, ఆ సినిమా పూర్తయ్యేవరకూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆగలేక ఈ కథనే అల్లు అర్జున్ కి చెప్పటంతో ఈ సినిమా లైన్లోకి వచ్చినట్లు తెలిసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటిస్తుందని సమాచారం.అలాగే అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాని ప్రముఖనిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ఈ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రాబోయే మూవీ ఏప్రెల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.