English | Telugu

ఓటీటీలో అల్లరి నరేష్ ఉగ్రరూపం!

'నాంది' వంటి హిట్ తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కలయికలో రూపొందిన రెండో చిత్రం 'ఉగ్రం'. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదలైంది. 'నాంది' స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా నరేష్ నటనకు, యాక్షన్ సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

'ఉగ్రం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 2 నుంచి 'ఉగ్రం' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. తూమ్ వెంకట్ కథ అందించగా, సినిమాటోగ్రాఫర్ గా సిద్ధార్థ్ జె, ఎడిటర్ గా చోటా కె. ప్రసాద్ వ్యవహరించారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.