English | Telugu

అఖండ-2 అప్డేట్.. 20 నిమిషాలు బాలయ్య తాండవం!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అఖండ-2'. బాలయ్య-బోయపాటి కాంబోతో పాటు, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'అఖండ'కి సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. (Akhanda 2 Thaandavam)

బాలయ్య-బోయపాటి కాంబో అంటే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'అఖండ'లో యాక్షన్ సీన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు 'అఖండ-2'లో అంతకుమించిన యాక్షన్ ఉండబోతుందట. ముఖ్యంగా 20 నిమిషాల ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ లో బాలయ్య తాండవం చూడనున్నామని, ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.