English | Telugu

చిరు ఫ్యాన్స్ ని కెలికితే అంతేమరి

రాక రాక ఓ విజ‌యం వ‌చ్చింది ర‌వికుమార్ చౌద‌రికి. అదీ... పిల్లా నువ్వు లేని జీవితంతో. కానీ ఆ హ్యాపీనెస్ కూడా ఇప్పుడు ఎగిరిపోయింది. చిరు ఫ్యాన్స్‌కి కెలికి పెద్ద త‌ప్పిద‌మే చేశాడీ ద‌ర్శ‌కుడు. పిల్లా నువ్వు లేని జీవితం స‌క్సెస్‌మీట్‌లో ''నేను బాల‌య్య అభిమానిని'' అని పొర‌పాటున నోరుజారాడు. ఆ త‌రవాత చౌద‌రి ఫేస్ బుక్‌లో కామెంట్ల మోత ఎక్కువైంది. ర‌వికుమార్ కూడా త‌క్కువ తిన‌లేదు. ''మీ బెల్ట్ హీరోలు'' అంటూ కులాన్ని గుర్తు చేస్తూ ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. దాంతో ర‌చ్చ ర‌చ్చ అయ్యింది. ర‌వికుమార్‌కు ఘాటైన స‌మాధానాలు ఇచ్చారు మెగా అభిమానులు. ఫేస్ బుక్‌లో ఈ రాద్దాంతం భ‌రించ‌లేక ఆ ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని.. ఆ కామెంట్ల‌తో నాకేం సంబంధం లేద‌ని క్లారిటీ ఇవ్వ‌బోయాడు ఈ ద‌ర్శ‌కుడు. అంతేకాదు... ఇప్పుడు ఫేస్ బుక్ నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ట‌. ఇక జ‌న్మ‌లో సోష‌ల్ నెట్ వ‌ర్క్ జోలికి పోకూడ‌ద‌ని గ‌ట్టిగా ఫిక్స‌య్యాడ‌ట‌. పాపం... ర‌వికుమార్ చౌద‌రికి ఇలా జ్ఞానోద‌యం అయ్యింద‌న్న‌మాట‌.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.