English | Telugu

'అఖండ'కు నాలుగేళ్లు.. అబ్బాయ్ ట్వీట్ కి బాబాయ్ ఫ్యాన్స్ రియాక్షన్..! 

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్
నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అఖండ
ఎన్టీఆర్ ట్వీట్ ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు
అఖండ-2 విడుదల రోజు ఎన్టీఆర్ ఏం చేయనున్నాడు?

సింహా, లెజెండ్ తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'అఖండ'(Akhanda). కోవిడ్ పాండమిక్ టైంలో.. మళ్ళీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారా? అనే అనుమానాలను బద్దలు కొడుతూ.. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం 2021, డిసెంబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టింది అఖండ. అఘోరగా బాలయ్య తాండవానికి బాక్సాఫీస్ షేక్ అయింది. ఓ వైపు కోవిడ్ భయం, మరోవైపు తక్కువ టికెట్ ధరలు వంటి ప్రతికూలతలు నడుమ.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టింది అంటే ఎంతటి సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

'అఖండ' అనేది నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తిండిపోయే ప్రత్యేక చిత్రం. ఇక ఆ సినిమా విడుదల రోజు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం.. ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని ఇచ్చింది. "ఇప్పుడే అఖండ చూశాను. సినిమాలో హార్డ్‌కోర్ ఫ్యాన్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయ్ కి, మూవీ టీంకి నా శుభాకాంక్షలు" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. "బాల బాబాయ్ కి కంగ్రాట్స్" అంటూ అబ్బాయ్ ట్వీట్ చేయడంతో.. ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు.

Also Read: 'అఖండ-2'లో శివుడి పాత్రలో చిరంజీవి!

'అఖండ' చూసి నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా, అందరి హీరోల అభిమానులు ఫిదా అయ్యారు. రౌద్రరసం పండించడంలో బాలయ్యకు బాలయ్యే సాటి అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కోవిడ్ భయాన్ని పక్కన పెట్టి, ఈ సినిమా చూడటానికి క్యూ కట్టారు. అందుకే 'అఖండ' అంతటి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు 'అఖండ'కు సీక్వెల్ గా 'అఖండ-2' వస్తోంది. ఈ డిసెంబర్ 5న విడుదల కానున్న 'అఖండ-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికి తోడు సీక్వెల్ హైప్, పైగా డివోషనల్ టచ్ కంటెంట్ తో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతోంది. దీంతో 'అఖండ-2' రూ.500 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Akhanda 2 Thaandavam)

నందమూరి అభిమానులు 'అఖండ-2' కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ఆరోజు మళ్ళీ ఎన్టీఆర్ ఏం ట్వీట్ చేస్తాడో చూడటం కోసం కూడా అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈసారి ఎన్టీఆర్ నుండి ఎలాంటి ట్వీట్ వస్తుందో.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.