English | Telugu

మహేష్ కృష్ణగారి అబ్బాయంట

మహేష్ "1" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతో... "ప్రతి సినిమా కూడా విడుదల తరువాత రికార్డులను బ్రేక్ చేస్తుంది. కానీ ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సాధిస్తుంది. ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలుస్తుంది" అని అన్నారు.

మహేష్ మాట్లాడుతూ... "బిజినెస్ మాన్" షూటింగ్ సమయంలో సుకుమార్ నాకు "1" కథ చెప్పారు. కానీ అయన టెన్షన్ లో సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ తర్వాత నేనే ఆయనకు ఫోన్ చేసి కథ చాలా బాగుంది. మనం చేద్దామని అన్నాను. సుకుమార్ ఆలోచనలకూ హ్యాట్సాఫ్. నేను, దేవిశ్రీప్రసాద్ కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ కుదరలేదు. ఈ సినిమా ద్వారా కుదిరింది. దేవి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అక్కడే ఉన్న యాంకర్ ఈ పాటలోని "who are you" అని మహేష్ ను సరదాగా అడిగితే.. "నేను కృష్ణగారి అబ్బాయి మహేష్ ని" అని నవ్వుతూ చెప్పారు.

సుకుమార్ మాట్లాడుతూ... "మహేష్ తో కలిసి నువ్వు పనిచెయ్ అని, మహేష్ తో కలిసి పనిచేసిన దర్శకులందరూ నాతో అనేవారు. అలా ఎందుకు అన్నారో ఇప్పుడు తెలుస్తుంది. ఆయన ఒక అద్భుతం. ఆయనతో ఇలా పనిచేయడానికే ఈ సినిమా షూటింగ్ కు రెండేళ్ళు పట్టింది. దేవి మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు" అని అన్నారు.

ఈ వేడుకకు నమ్రత, గౌతమ్, సంజయ్, సుధీర్, హీరోయిన్ కృతిసనన్ లతో పాటు పలువురు దర్శక, నిర్మాతలు విచ్చేసి చిత్రం విజయం సాధించాలని కోరారు. 14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.