English | Telugu
1 డబ్బింగ్ ఒకేసారి 70 మందితో
Updated : Dec 28, 2013
టాలీవుడ్ మొత్తం కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం "1". మహేష్ నటించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఒక సన్నివేశం కోసం ఒకేసారి 70 మందితో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన డబ్బింగ్ థియేటర్ ను ఏర్పాటు చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం అందిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది.