English | Telugu

సినిమా పేరు:వి
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 5, 2020

నటీనటులు: సుధీర్ బాబు, నివేదా థామస్, నాని, అదితీరావు హైదరీ, హరీష్  ఉత్తమన్, తనికెళ్ళ భరణి, రవి వర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: పీజీ విందా
నేపథ్య సంగీతం:  ఎస్.ఎస్. తమన్
పాటలు: అమిత్ త్రివేది 
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి 
నిర్మాతలు: 'దిల్' రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి  
విడుదల తేదీ: 05 సెప్టెంబర్ 2020 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో)

'వి' చిత్రానికి ఉన్న ప్రత్యేకతలు ఎన్నో... ఇది నాని 25వ సినిమా! 'అష్టా చమ్మా'తో అతడిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, 'వి'తో అతడిని ప్రతినాయకుడి(విలన్)గా పరిచయం చేస్తున్న సినిమా! పైగా, 'అష్టా చమ్మా' విడుదలైన సెప్టెంబర్ 5న విడుదలైన సినిమా. అంతేనా? ఇందులో సుధీర్ బాబు హీరోగా నటించారు. నివేదా థామస్, అదితీరావు హీరోయిన్లు. ఒటీటీలో విడుదల అవుతున్న భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్న సినిమా. శుక్రవారం రాత్రి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ: డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) కి పోలీసు డిపార్ట్మెంట్, ప్రజల్లో మంచి పేరు ఉంది. టప్పచబుత్రాలో మతకలహాలను సమర్థవంతంగా అణిచివేశాడని ప్రభుత్వం అతడికి గ్యాలంటరీ మెడల్ ఇస్తుంది. మెడల్ అందుకున్నందుకు పార్టీ ఇచ్చిన తెల్లారి ఇన్స్పెక్టర్ ప్రసాద్ ని ఎవరో హత్య చేస్తారు. ఆ హంతకుడు (నాని) దమ్ముంటే తనను అడ్డుకోమని ఆదిత్యకు సవాల్ విసురుతాడు. చంపబోయే వ్యక్తుల గురించి క్లూస్ ఇచ్చి మరీ చంపుతాడు. అతడు ఆ హత్యలు ఎందుకు చేశాడు? అతడిని ఆదిత్య పట్టుకున్నాడా? లేదా? ఆదిత్యకు అపూర్వ రామానుజమ్ (నివేదా థామస్) ఎలా సహాయం చేసింది? ఈ కథలో సాహెబా (అదితీరావు హైదరి) పాత్ర ఏమిటి? మతకలహాలకు, హత్యలకు సంబంధం ఉందా? తదితర ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి. 

ప్లస్‌ పాయింట్స్‌:
నాని 
నేపథ్యం సంగీతం 
సినిమాటోగ్రఫీ 

మైనస్‌ పాయింట్స్‌:
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
ప్రేమకథలు 
ట్విస్టులు  
క్లైమ్యాక్స్   


ఎనాలసిస్ :

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి 'అష్టా చమ్మా', 'జెంటిల్ మన్', 'సమ్మోహనం' చిత్రాలు మంచి విజయాలను అందించాయి. ఆ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ సినిమా ఇది. రొటీన్ రివేంజ్ స్టోరీ తీసుకున్నప్పటికీ, స్క్రీన్ ప్లే పర్లేదు అనేలా రాసుకున్నారు. కానీ, ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ట్విస్టులు రాసుకోవడంలో, రేసీగా సినిమాను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. సినిమా  చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్టు పలు సన్నివేశాల్లో ప్రేక్షకుడికి అనిపిస్తుంది. దానికి తోడు ప్రేమకథలు పరమ రోటీన్ గా ఉన్నాయి. ముఖ్యంగా నివేదా థామస్ ట్రాక్ ఇరికించినట్టు ఉంటుంది.  సినిమా రచయితగా, దర్శకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి ఫెయిల్ అయ్యారు.

అమిత్ త్రివేది పాటల్లో 'వస్తున్నా వచ్చేస్తున్నా', 'మనసు మరీ...' బావున్నాయి. మరో రెండు పార్టీ సాంగ్స్ అంతే. గుర్తు పెట్టుకోవడం కష్టం. పాటల కంటే తమన్ అందించిన నేపథ్య సంగీతం బావుంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మాణ విలువలు బావున్నాయి.

నటీనటుల పనితీరు: డైలాగ్ డెలివరీ, మేనరిజమ్ నుండి ప్రతి సన్నివేశంలో యాక్టింగ్ పరంగా నాని కొత్తగా చేశాడు. విలన్ పాత్రలో అతడు పర్ఫెక్ట్. స్క్రీన్ మీద అతడు కనిపించిన ప్రతిసారీ సినిమాలో ఒక హై వస్తుంది. తన నటనతో నాని కొన్ని సన్నివేశాలను నిలబెట్టాడు. డీసీపీగా సుధీర్ బాబు బాగానే చేశాడు. పాత్రకు సూట్ అయ్యాడు. మొదటి పాటలో డ్యాన్స్ బాగా చేశాడు. మోడ్రన్ డ్రస్సులలో ట్రెండీగా కనిపించడానికి నివేదా థామస్ ప్రయత్నించింది. నటన విషయానికి వస్తే ఎప్పటిలా బాగా చేసింది. అదితీరావు హైదరి కథలో కీలకమైన పాత్రలో కనిపించింది. తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

 'వి'ని థ్రిల్లర్ అనడం కంటే రెగ్యులర్ రివేంజ్ డ్రామా అంటే బావుంటుందేమో. ఈ సినిమాలో థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ చాలా తక్కువ. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా అంటే చాలా తక్కువ. అయితే, నాని తనలో  నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయడం గ్యారెంటీ. అతడి కోసం సినిమాను ఒకసారి చూడవచ్చు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25