English | Telugu

సినిమా పేరు:టాక్సీవాలా
బ్యానర్:జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 17, 2018

నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్, మధునందన్, ఉత్తేజ్, రవివర్మ, కళ్యాణి, యమున తదితరులు
కెమెరా: సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: సాయికుమార్ రెడ్డి
సంగీతం: జేక్స్ బిజాయ్
నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్
నిర్మాత‌: ఎస్.కె.ఎన్
కథ, ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ సంక్రిత్యాన్  
విడుదల తేదీ: నవంబర్ 17, 2018

విడుదలకు ముందు సినిమా మొత్తం నెట్టింట్లోకి వచ్చేసినా... పైరసీ రక్కసి సినిమాను కాటేసినా... విజయాన్ని ప్రభావితం చేయలేదని పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' నిరూపించింది. కంటెంట్ వుంటే థియేటర్లకు వచ్చి మరీ సినిమా చూస్తామని ప్రేక్షకులు నిరూపించారు. మరి, 'టాక్సీవాలా' పరిస్థితి ఏంటి? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా మొత్తం ఎప్పుడో నెట్టింట్లోకి వచ్చింది. ఈ సినిమా విజయాన్ని పైరసీ ప్రభావితం చేస్తుందా? సినిమాలో కంటెంట్ ఎంతుంది? రివ్యూ చదివి తెలుసుకోండి.

క‌థ‌:

శివ (విజయ్ దేవరకొండ) ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. రెండు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాక... పాత కారు కొని 'ఓలా క్యాబ్‌' కారు పెట్టి, క్యాబ్ డ్రైవ‌ర్‌గా ట్రిప్పులు వేయడం మొదలు పెడతాడు. అంతా సంతోషంగా వుందనుకున్న తరుణంలో కారులో ఒక ఆత్మ వుందని శివ తెలుసుకుంటాడు. ముందు భయపడి కారును అమ్మేయాలని ప్రయత్నిస్తాడు. తరవాత పరిస్థితుల ప్రభావం వలన మళ్లీ కారు ఎక్కుతాడు. క్యాబ్ డ్రైవ‌ర్‌గా ట్రిప్పులు వేయడం మొదలు పెడతాడు. ఓ సందర్భంలో కారు ఎక్కిన ప్రయాణికుణ్ణి ఆత్మ చంపేస్తుంది. అసలు, ఆత్మ అతణ్ణి ఎందుకు చంపింది? తన కళ్ల ముందు ఓ ప్రాణం పోయాక శివ ఏం చేశాడు? ఆత్మ కథేంటి? ఆత్మ వలన శివ కథ ఏ కంచికి చేరింది? అనేది మిగతా సినిమా!


ఎనాలసిస్ :

సూప‌ర్ నేచ‌రుల్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది! కానీ, దర్శకుడు చాలా తెలివిగా ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తూ కథలోకి వెళ్లాడు. మొదట రెగ్యులర్ హారర్ సినిమాల తరహాలో ప్రేక్షకులను నవ్వించినా... ఇంటర్వెల్ వచ్చేసరికి సూపర్ థ్రిల్ ఇచ్చాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా అక్కడక్కగా థ్రిల్ ఇస్తూ సాగుతుంది. సెకండాఫ్‌లో వ‌చ్చే ఫ్లాష్‌బ్యాక్‌ సుదీర్ఘంగా సాగడం సినిమాకు మైనస్. అందులో ఎక్కడా విజయ్ దేవరకొండ కనిపించడు. ఆ తరవాత హీరో, అతని స్నేహితులు దొంగతనం చేయడానికి వెళ్లిన సన్నివేశం బాగా నవ్విస్తుంది. కథ గురించి ఎక్కువ విశ్లేషిస్తే సినిమా చూడబోయే ప్రేక్షకులకు కిక్ వుండదు. కానీ, ఒక్కటి మాత్రం చెప్పాలి... దర్శకుడు కథ నుంచి బయటకు వెళ్లలేదు.  సగటు కమర్షియల్ అంశాల జోలికి వెళ్లలేదు. అందువల్ల, కొంచెం హీరోయిజం తగ్గింది. విజయ్ దేవరకొండ నుంచి అభిమానులు ఆశించే అంశాలు తగ్గాయి. కానీ, కొంచెం కొత్త కథను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. అయితే.. కథకు బీజమైన ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పాయింట్ సామాన్యులకు అర్థం కాదు. జేక్స్ బీజాయ్ పాటల్లో 'మాటే వినదుగా..' ఇప్పటికే ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతోంది. మిగతా పాటలు ఆ స్థాయిలో లేవు. కానీ, నేపథ్య సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో వుండటం వలన చిన్న సినిమాగా కనిపించదు. హీరో వుండే గ్యారేజ్ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. చూడటానికి బావుంది.

ప్లస్ పాయింట్స్:

విజయ్ దేవరకొండ నటన
సినిమా కాన్సెప్ట్ ప్లస్ కామెడీ
రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం

మైనస్ పాయింట్స్:

సగటు ప్రేక్షకులకు అంతగా అర్థం కాని క్లైమాక్స్
ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌

నటీనటుల పనితీరు:
విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్, స్టయిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అతడి గత సినిమాలకు భిన్నంగా వుంటుందీ సినిమాలో క్యారెక్టర్. భయపడే సన్నివేశాల్లో బాగా నటించిన విజయ్ దేవరకొండ, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ పాత్ర 'మాటే వినదుగా' పాటతో పాటు కొన్ని సన్నివేశాలకు పరిమితమైంది. మాళవికా నాయర్ కథకు కీలకమైన పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. హీరో స్నేహితుడి పాత్రలో మధునందన్, అతని దగ్గర పనిచేసే హాలీవుడ్ పాత్రలో నటించిన వ్యక్తి, చమ్మక్ చంద్ర బాగా నవ్వించారు. రవివర్మ, ఉత్తేజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కళ్యాణి, యమున పాత్రలు ఎమోషనల్‌గా సాగాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'టాక్సీవాలా' నవ్విస్తాడు. మధ్య మధ్యలో భయపెడతాడు. థ్రిల్ ఇస్తాడు. చివరిలో కొంచెం మనకు అర్థం కాని సన్నివేశాలతో ముగిస్తాడు. 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' విజ‌యాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్‌డ‌మ్ పెరిగింది. అతడికి ఫాన్స్ పెరిగారు. వారందరినీ 'నోటా' నిరాశ పెరిచింది. కానీ, 'టాక్సీవాలా' మాత్రం అలా చేయదు. మంచి సినిమా చూశామన్న సంతృప్తి ఇస్తుంది.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25