English | Telugu

సినిమా పేరు: స్టాండప్ రాహుల్
బ్యానర్:డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్
Rating:1.75
విడుదలయిన తేది:Mar 19, 2022

సినిమా పేరు: స్టాండప్ రాహుల్
తారాగ‌ణం: రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, ఇంద్రజ, మురళి శర్మ, వెన్నెల కిషోర్
సంగీతం: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటర్: రవితేజ గిరజాల
బ్యానర్స్: డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్
నిర్మాతలు: నందకుమార్, భరత్
రచన, దర్శకత్వం: శాంటో
విడుదల తేదీ: మార్చి 18, 2022

'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21F' ఇలా మొదటి మూడు సినిమాలతో మంచి విజయాలు అందుకొని హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్.. ఆ తర్వాత మాత్రం హిట్ అందుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ఐదేళ్లుగా అందని ద్రాక్షలా మారిన హిట్ కోసం తపిస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు 'స్టాండప్ రాహుల్'తో ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కి హిట్ అందించిందా? లేక అలాగే ప్లాప్ బెంచ్ లో కూర్చోబెట్టిందో తెలుసుకుందాం.

కథ:- ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి నుంచి కలలు కనే శ్రేయ(వర్ష బొల్లమ్మ) పెళ్లీడు వచ్చినా లైఫ్ పార్టనర్ ని సెలెక్ట్ చేసుకోలేకపోతుంది. మరోవైపు ఆమె పేరెంట్స్ తనకి అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. ఇక లైఫ్ పట్ల ఏ మాత్రం బాధ్యత లేని వాడిగా అందరి చేత మాటలు పడే రాహుల్(రాజ్ తరుణ్).. తన తల్లిదండ్రులు విడిపోవడంతో  తానుపెళ్లి చేసుకోకుండా జీవితాంతం సింగల్ గా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. తనకి స్టాండప్ కమెడియన్ అవ్వాలని ఉన్నా తన తల్లికి ఇచ్చిన మాట కోసం జాబ్ జాయిన్ అవుతాడు. అదే కంపెనీలో శ్రేయ కూడా చేరుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే శ్రేయ, పెళ్లి అంటే పారిపోయే రాహుల్ ఒకరికొకరు ముందే తెలుసా? పెళ్లిపై భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్లిద్దరూ కలుసుకున్నారా? స్టాండప్ కమెడియన్ కావాలన్నా రాహుల్ డ్రీమ్ నెరవేరిందా? వంటివి తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

ఫ్యామిలీ కోసం జాబ్ చేయాలా? లేక మన మనసుకి నచ్చిన పని చేయాలా? అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. అదే పాయింట్ ని తీసుకొని డైరెక్టర్ శాంటో ఈ కథ రాసుకున్నాడు. 'ప్యాషన్ కోసం ఫ్యామిలీని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, అలాగే మన వాళ్ళ ప్యాషన్ అర్థంచేసుకొని మనం వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలి' అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ కోసం ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూనే.. మన కోసం మన ప్యాషన్ ఫాలో అవ్వాలి అనే పాయింట్ చెప్పాడు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే.. కానీ దానిని నడిపించిన విధానమే ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఎంగేజింగ్ గా లేదు. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోయి బయటపడతామా అనే ఫీలింగ్ ఆడియెన్స్ లో కలుగుతుంది.

ఈ సినిమాలో హీరో స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకుంటాడు. కానీ అతను చేసే స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించకపోగా, ఏదో స్పీచ్ లు విన్న ఫీలింగ్ కలిగిస్తుంది. టీవీ షోలలో ఇలాంటి స్టాండప్ కామెడీలు ఎన్నో చూస్తున్న ఆడియన్స్ ని.. సోషల్ మీడియా మీమ్స్, అవుట్ డేటెడ్ జోక్స్ తో నవ్వించాలనుకొని చేతులు కాల్చుకున్నాడు డైరెక్టర్. పైనాపిల్ కంపెనీ అంటూ వెన్నెల కిషోర్ తో కామెడీ చేసే ప్రయత్నం చేశాడు కానీ అదీ వర్కౌట్ కాలేదు. 

హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. హీరో ప్రేమలో హీరోయిన్ పడే సన్నివేశాలు కృత్రిమంగా ఉన్నాయి. ఆ పాత్రలను ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. హీరోయిన్ హీరోకి దూరమవుతున్న పెయిన్ గానీ, ఫీల్ గానీ మనకి కలగదు. నిజానికి ఈ కథలో కామెడీకి, సెంటిమెంట్ కి చోటుంది. కానీ ఎంటర్టైన్ చేయడం, ఎమోషనల్ కి గురి చేయడం ఈ రెండిట్లోనూ సినిమా ఫెయిలైంది.

స్వీకర్ అగస్తి సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ తేలిపోయింది. శ్రీరాజ్ రవీంద్రన్ కెమెరా పనితనం బాగుంది. ఎడిటర్ రవితేజ కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది.

నటీనటుల పనితీరు:- రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ పెయిర్ బాగుంది. ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేశారు. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నారు. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో వారి కష్టం వృధా అయింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులుగా ఇంద్రజ, మురళి శర్మ ఆకట్టుకున్నారు. వారి సీనియారిటీతో ఆ పాత్రలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. స్టీవ్ జాబ్స్ ని ఇమిటేట్ చేస్తూ వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ ఆ ట్రాక్ వర్కౌట్ కాలేదు. దేవీప్రసాద్, వెంకటేష్ మహా, రాజ్ మాదిరాజ్ వారి పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పేరుకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయిన సినిమా 'స్టాండప్ రాహుల్'. 'కూర్చుంది చాలు' అని క్యాప్షన్ కి తగ్గట్లు గానే ఆడియెన్స్ కి బోర్ కొట్టకుండా రెండు గంటలు కూడా కూర్చోబెట్టలేకపోయారు. 

-గంగసాని

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25