English | Telugu

సినిమా పేరు:రాజుగారి గది 3
బ్యానర్:ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
Rating:1.75
విడుదలయిన తేది:Oct 18, 2019

నటీనటులు: అశ్విన్ బాబు, అవికాగోర్‌, అశ్విన్ బాబు, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్ ఘోష్‌, ఊర్వ‌శి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి
సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌:  గౌతంరాజు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సాహి సురేశ్‌
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
పాటలు: శ‌్రీమ‌ణి
ఆడియోగ్ర‌ఫీ:  రాధాకృష్ణ‌
స్టంట్స్‌:  వెంక‌ట్‌
విడుదల తేదీ: 18 అక్టోబర్ 2019

'రాజుగారి గది' విడుదలైనప్పుడు సినిమాపై ఎవరికీ అంచనాలు లేవు. అందులో పేరున్న నటీనటులు లేనప్పటికీ... వినోదం నచ్చడంతో ప్రేక్షకులు విజయాన్ని కట్టబెట్టారు. 'రాజుగారి గది 2'కి వచ్చే సరికి అందులో నాగార్జున, సమంత వంటి స్టార్స్ ఉన్నారు. కానీ, సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అందులో వినోదం తక్కువైందనే విమర్శలు వచ్చాయని ఓంకార్ స్వయంగా అంగీకరించారు. మరి, 'రాజుగారి గది 3' ఎలా ఉంది? తమ్ముణ్ణి సోలో హీరోగా నిలబెట్టాలని ఓంకార్ చేసిన ప్రయత్నం సత్ఫాలితాలను ఇచ్చేలా ఉందా? రివ్యూ చదవండి.
 
కథ:

మాయ (అవికా గోర్) ఒక హాస్పిటల్ లో డాక్టర్. ఆమెకు ఎవరు ఐ లవ్యూ చెప్పినా ఓ దెయ్యం వచ్చి చితక్కొడుతుంది. దెయ్యం చేతిలో తన్నులు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ), తమ కాలనీలో జనాలను ఇబ్బంది పెడుతున్న అశ్విన్ (అశ్విన్ బాబు)కు తగిన శాస్తి చేయాలని మాయతో ప్రేమలో పడేలా చేస్తాడు. దెయ్యం అశ్విన్‌ని కూడా కొడుతుంది. క్షుద్రపూజలు చేసే మాయ తండ్రి పిళ్ళై (అజయ్ ఘోష్), కుమార్తెకు రక్షణగా దెయ్యాన్ని పంపాడని అశ్విన్‌కి తెలుస్తుంది. మాయను ప్రేమించిన విషయం పిళ్ళైకి చెప్పి, ఆమెను ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి అశ్విన్ కేరళ వెళతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత పిళ్ళైకి తాంత్రిక విద్యలు రావని తెలుసుకుంటాడు. మరి, మాయకు రక్షణగా ఉన్న దెయ్యం ఎవరు? అశ్విన్, మాయ కథ ఏమైంది? అనేది మిగతా సినిమా.


ఎనాలసిస్ :

'రాజుగారి గది 3'లో సరుకు ఉందో? లేదో? థియేటర్లలో అడుగు పెట్టిన పది నిమిషాల్లో ప్రేక్షకులకు అర్థం అవుతుంది. 'జబర్దస్త్' కామెడీ షోలో గెటప్ శీనుకు పేరు తెచ్చిన పాత్రల్లో ఒకటైన బిల్డప్ బాబాయ్ పాత్రను రిపీట్ చేయడంతో ఓంకార్ పెన్నులో ఇంకు అయిపోయిందా? లేదా అతడి బుర్రలో కొత్త ఆలోచనలు రావడం లేదా? అనే సందేశాలు కలుగుతాయి. బిల్డప్ బాబాయ్ పాత్రను పక్కన పెడితే... తమ్ముణ్ణి సోలో హీరోగా నిలబెట్టడానికి ఓంకార్ తీసిన బిల్డప్ సీన్స్, షాట్స్ ఓవర్ అనిపిస్తాయి. అశ్విన్ బాబు, అలీ కాంబినేషన్‌లో సీన్స్ ఏవీ నవ్వించలేదు. ఫస్టాఫ్‌లో అటు హారర్ లేదు, ఇటు కామెడీ లేదు, సన్నివేశాల్లో బలం లేదు. ఏదో తీసుకుంటూ వెళ్లారు.

కామెడీ సరిగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్‌లోనూ స్టార్టింగ్ సోసోగా ఉన్నప్పటికీ, పాత భవనంలోకి కథ వెళ్లిన తర్వాత ఊర్వశి, అజయ్ ఘోష్ నటించిన లౌడ్, మాస్ కామెడీ సీన్లు కొంతవరకూ నవ్విస్తాయి. అయితే... సినిమా ఎడిటింగ్ బాలేదు. అందుకు కారణం దర్శకుడే. హీరో హీరోయిన్ మధ్య డ్రీమ్ సాంగ్ ఒకటి ప్లాన్ చేసి, షూట్ చేయకుండా వదిలేశారో? షూట్ చేసి సినిమాలో ఆ పాటకు చోటు కల్పించలేదో? తెలియదు. కానీ, 'అమ్మాయి ప్రేమించిందని తెలియగానే ప్రతి ఒక్కడూ డ్రీమ్ సాంగులోకి వెళ్లిపోవడమే' అని అలీ చేత ఓ డైలాగ్ చెప్పించారు. ప్రేక్షకులు పసిగట్టేలా ఇటువంటి జంపింగ్ సీన్లు సినిమాలో కొన్ని ఉన్నాయి. సన్నివేశాల్లో బలం లేదంటే, నేపథ్య సంగీతం అసలు బాలేదు. పాటలు గుర్తించుకునేలా లేవు. ఐటమ్ సాంగులో అమ్మాయిలను అంత వరస్ట్ గా ఈ మధ్య కాలంలో ఎవరూ చూపించి ఉండరు. ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్న ఈ సినిమాకు ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది. సన్నివేశాలకు తగ్గట్టు క్వాలిటీ సినిమాటోగ్రఫీ అందించారు.

ప్లస్ పాయింట్స్:

ఉర్వశి, అజయ్ ఘోష్ కామెడీ
సినిమాటోగ్రఫీ
అవికా గోర్

మైనస్ పాయింట్స్:

హీరో బిల్డప్ సీన్స్, షాట్స్
సాంగ్స్, రీరికార్డింగ్
ఎడిటింగ్
ఫస్టాఫ్
దర్శకత్వం

నటీనటులు:

'రాజుగారి గది', 'రాజుగారి గది 2'లో అశ్విన్ బాబు నలుగురిలో ఒకడిగా చేశాడు. కానీ, ఈ సినిమాలో అతడే మెయిన్ హీరో. మెయిన్ హీరోకి ఇవ్వాల్సిన బిల్డప్ సీన్స్, షాట్స్ అన్ని ఓంకార్ బాగా రాశారు. తీశారు. కానీ, వాటిలో అశ్విన్ బాబును చూడటం కష్టంగానే ఉంటుంది. స్మాల్ సైజ్ బాడీకి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ షర్ట్స్ వేస్తే ఎలా ఉంటుందో... అలా నటుడిగా తన ఇమేజ్‌కి మించిన సీన్లు పడటంతో అశ్విన్ తేలిపోయాడు. అవికా గోర్ పాత్రకు తగ్గట్టు చక్కటి అభినయం ప్రదర్శించింది. అలీ కామెడీ టైమింగును దర్శకుడు వాడుకోలేకపోయాడు. ఉర్వశి, అజయ్ ఘోష్ నవ్వించారు. ధనరాజ్, బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టర్, హరితేజ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'జబర్దస్త్' కామెడీ షోను ఇష్టపడేవాళ్లు 'రాజుగారి గది 3'లో సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలను ఎంజాయ్ చేయగలరు. కాస్త కామెడీ తప్ప సినిమాలో బలమైన కథ, సన్నివేశాలు, మంచి పాటలు లేవు. వాటి కోసం వంద, నూటయాభై రూపాయలు ఖర్చుపెట్టి థియేటర్లకు వెళ్లాలా? వద్దా? అనేది ప్రేక్షకులు ఆలోచించుకోవాలి.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25