English | Telugu

సినిమా పేరు:నన్ను దోచుకుందువటే రివ్యూ
బ్యానర్:సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌
Rating:2.50
విడుదలయిన తేది:Sep 21, 2018

నటీనటులు: సుధీర్‌బాబు, నభ నటేష్, నాజర్, తులసి, వర్షిణి సౌంద‌ర్‌రాజ‌న్‌, వేణు, సుదర్శన్, వైవా హర్ష తదితరులు
కూర్పు: చోటా కె ప్రసాద్
కెమెరా: సురేష్ రగుతు
సంగీతం: అజనీష్ లోకనాథ్
సమర్పణ: రాణి పోసాని
సంస్థ: సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత:  సుధీర్‌బాబు
రచన, దర్శకత్వం: ఆర్.ఎస్. నాయుడు
విడుదల తేదీ: 21/09/ 2018

ప్రతి కథలో ఒక స్టార్టింగ్, ఇంటర్వెల్, చివర్లో ఎండింగ్ (క్లైమాక్స్) వుంటాయి. ప్రతి ప్రేమకథలోనూ హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, జీవితంలో కొంత దూరం కలసి ప్రయాణించాక పరిస్థితుల ప్రభావం వలన విడిపోవడం, చివరికి కలుసుకోవడం సహజమే. ఇంట్రడక్షన్, బ్రేకప్, ప్యాచప్ అన్నమాట! శుక్రవారం శుక్రవారం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకుడికి ఇంట్రడక్షన్, బ్రేకప్, ప్యాచప్ అంతకు ముందు సినిమాలో వున్నట్టు అనిపిస్తే ప్లాప్ టాక్ వస్తుంది. అంతకు ముందు చూసిన సన్నివేశాలను దర్శకుడు కొత్తగా తీశాడని భావిస్తే పాజిటివ్ టాక్‌తో సినిమాకు, సినిమా టీమ్‌లో వ‌ర్క్ చేసిన ప్ర‌తి ఒక్క‌రి కెరీర్‌కి బూస్ట్ ఇస్తుంది. 'నన్ను దోచుకుందువటే' అందరికీ బూస్ట్ ఇచ్చే చిత్రమే!     

కథ:

కార్తీక్ (సుధీర్‌బాబు) సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజ‌ర్‌. పని రాక్షసుడు. అతను పేరు చెబితే కంపెనీలో ఉద్యోగులు అందరికీ హడల్. సరిగా పని చేయడం లేదని ఎక్కడ ఉద్యోగంలో నుంచి తీసేస్తాడో? అని! అతడి జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి ఆలోచనలు లేవు. ప్రమోషన్ మీద అమెరికా వెళ్లడమే కార్తీక్ గోల్. మావయ్య కోరిక మేరకు మరదలు సత్య (వర్షిణి సౌంద‌ర్‌రాజ‌న్‌)ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. తాను వేరొకర్ని ప్రేమిస్తున్నానని, ఇంట్లో ఏదో ఒకటి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయ‌మ‌ని కోరుతుంది. తండ్రి (నాజర్) దగ్గరకు వెళ్లి మరదలు అంటే ఇష్టం లేదని చెబుతాడు కార్తీక్. ఎందుకు? అని ప్రశ్నిస్తే... త‌న‌తో పాటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న సిరి అనే అమ్మాయితో ప్రేమ‌లో వున్నాన‌ని చెబుతాడు. షార్ట్ ఫిల్మ్స్‌లో న‌టించే మేఘ‌న (న‌భ న‌టేష్‌)ని తన గాళ్‌ఫ్రెండ్‌గా పరిచయం చేస్తాడు. రెండు రోజులు సిరి పాత్రలో నటించమని ఆమెతో మాట్లాడతారు. తరవాత మెల్ల మెల్లగా ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు. అయితే... మనసులో మాటలను మాత్రం బయటపెట్టారు. పరిస్థితుల ప్రభావం వలన ఐలవ్యూలు చెప్పుకోకుండా విడిపోతారు. చివరికి కార్తీక్, మేఘన ఎలా ఒక్కటయ్యారు? అనేది చిత్రకథ.


ఎనాలసిస్ :

ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఓ అబద్ధంతో మొదలైన కార్తీక్, మేఘన ప్రయాణం ఎలా నిజమైంది? అనేది సినిమా! మన్మథుడులో నాగార్జున తరహా హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, నలుగురితో నవ్వుతూ ఇట్టే కలిసిపోయే హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్‌ ప్రేక్షకులకు కొత్త కాదు. కాని వాటిని బేస్ చేసుకుని కొత్త దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు రాసిన సన్నివేశాలు కొత్తగా వున్నాయి. సినిమాలో ఒక ఫ్రెష్ ఫీల్ వుంది. షార్ట్ ఫిల్మ్స్‌ నేపథ్యంలో రాసిన ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. దర్శకుడిది షార్ట్ ఫిల్మ్స్ బ్యాగ్రౌండ్ కావడంతో ఆయా సన్నివేశాలను బాగా తీశాడు. హీరో కానీ... హీరోయిన్ కానీ... ఎదుటి వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేసేలోపు సందర్భాలు శత్రువులుగా మారి అడ్డుపడే ఆగే సన్నివేశాలను బాగా రాశాడు. అయితే... ఇంటర్వెల్ ముందు, క్లైమాక్స్ ముందు సన్నివేశాలను కాస్త సాగదీసిన భావన కలుగుతుంది. నటీనటుల చేత దర్శకుడు చక్కగా చేయించుకున్నాడు. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రేమకథకు కావలసిన ఫీల్‌ని సురేష్ రగుతు తన లైటింగ్, ఫ్రేమింగ్‌తో తెచ్చాడు. హీరో నిర్మాత కావడంతో ఖర్చుకు వెనుకాడలేదని ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తుంది. అజనీష్ లోకనాథ్ స్వరాలు, నేపథ్య సంగీతం కథకు తగ్గట్టు వున్నాయి.

నటీనటుల పనితీరు:

సుధీర్‌బాబు ఇంతకు ముందు ప్రేమకథల్లో నటించాడు. ఇందులోనూ నటించాడు. ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా ఏంటంటే... చాలా స్టైలిష్‌గా క‌నిపించాడు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా డైలాగ్ డిక్షన్ మెరుగవుతోంది. నాజర్, తులసి, వైవా హర్ష, సుదర్శన్, వేణు, వర్షిణి... అందరూ పాత్రలకు తగ్గట్టు చేశారు. చక్కగా నటించారు. వీళ్లందరి నటనను ప్రేక్షకులు మర్చిపోయేలా చేసింది హీరోయిన్ నభ నటేష్. అమ్మాయి ఫేస్ చాలా ఎక్స్‌ప్రెసివ్‌. తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో చాలా సన్నివేశాలకు అందాన్ని తీసుకొచ్చింది. సినిమాలో నటీనటుల అందరి నటన ఒక ఎత్తు... నభ నటేష్ నటన మరో ఎత్తు. రెగ్యుల‌ర్ హీరోయిన్స్‌లా కాకుండా క్యూట్ అండ్ చుబ్బీగా వుంది. యువత ఆ అమ్మాయితో ప్రేమలో పడతారు.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథ కొత్తగా వుందని చెప్పలేం. కాని కథను తెరకెక్కించిన తీరు కొత్తగా వుంది. అంటే... హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు కొత్తగా ఫ్రెష్ ఫీల్‌తో సాగాయి. సినిమాటోగ్రఫీ రిచ్‌గా వుంది. చాలా సందర్భాల్లో నవ్విస్తుంది. ఒక మంచి చిత్రం చూశామనే భావన కలిగిస్తుంది.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25