English | Telugu

సినిమా పేరు:నా నువ్వే
బ్యానర్:కూల్ బ్రీజ్ సినిమాస్
Rating:2.00
విడుదలయిన తేది:Jun 14, 2018

నటీనటులు: కళ్యాణ్‌రామ్‌, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, సురేఖ తదితరులు.
దర్శకత్వం : జయేంద్ర.
బ్యానర్‌: కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌.
నిర్మాతలు: కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి
సంగీతం: శరత్‌
విడుదల తేదీ: జూన్‌ 18, 2018

చాలా రోజుల నుంచి కళ్యాణ్‌రామ్‌కు సరైన కమర్షియల్‌ హిట్‌ లేదు. అతని చివరి సినిమా MLA కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. అందుకనే కళ్యాణ్‌రామ్‌ తన ఆశలన్నింటినీ ‘నా నువ్వే’ చిత్రం మీదే పెట్టుకున్నాడు. ఇక తమన్నా కూడా ఓ విజయం కోసం ఆశపడుతోంది. దర్శకుడు జయేంద్ర తొలి సినిమా ఫ్లాప్‌ కావడంతో, అతని రెండో సినిమా నా నువ్వే మీదే ఆశలు పెట్టుకున్నాడు. మరి వీళ్లందరి ఆశల్నీ ‘నా నువ్వే’ కాపాడిందో లేదో తెలుసుకుందామా...

కథ:

మీరా (తమన్నా) ఓ న్యాయవాది (తనికెళ్ల భరణి) కూతురు. మీరా చదువులో వీక్. కానీ విధిని మాత్రం బాగా నమ్ముతుంది! ఒకసారి మీరా చేతిలోకి ‘లవ్‌ సైన్స్‌’ అనే పుస్తకం వస్తుంది. అందులో వరుణ్‌ ఫొటో ఉంటుంది (కళ్యాణ్‌ రామ్‌). దాంతో వరుణ్‌ని తన అదృష్టంగా మీరా నమ్ముతుంది. పైగా ఆ ఫొటో కనిపించిన దగ్గర్నుంచీ ఆమె జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తుంటాయి. అందుకనే వరుణ్‌ని కలిసి తనని ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. కానీ విధిని నమ్మని వరుణ్‌, మీరా ముందు ఓ సవాలు ఉంచుతాడు. దాని మీరా అంగీకరిస్తుంది కూడా. ఇంతకీ ఏమిటా సవాలు? ఆ పరీక్షలో మీరా నెగ్గుతుందా? మీరా, వరుణ్‌ల ప్రేమ ఏమవుతుంది?

పాజిటివ్‌ విషయాలు:

1. సంగీతం
2. తమన్నా
3. ఛాయాగ్రహణం

నెగెటివ్‌ విషయాలు:

1. రొటీన్‌ కథ
2. నిదానంగా సాగే కథనం
3. పాటల్ని పేర్చుకుంటూ పోవడం
4. రొమాన్స్‌
5. కళ్యాణ్‌రామ్‌ మేకోవర్‌

 


ఎనాలసిస్ :

ప్రేమ కథలలో సాధారణంగా ఓ కొత్త కథ కానీ, భావోద్వేగాలు కానీ ఉన్నప్పుడే విజయవంతం అవుతాయి. కానీ నా నువ్వేలో అలాంటి కొత్తదనమేం కనిపించదు. కథని చిత్రీకరించిన తీరు కూడా విభిన్నంగా ఏమీ లేదు. నిజానికి నా నువ్వే సినిమా మొత్తం మీద ఆసక్తికరమైన విషయాలేవీ కనిపించవు. ఒక రేడియో జాకీ పాత్రలో తమన్నా శ్రోతలకు తన ప్రేమకథని వినిపించడంతో సినిమా మొదలవుతుంది. తమన్నా, కళ్యాణ్‌రామ్‌ విభిన్నమైన వ్యక్తిత్వాలు కలవారు. ఒకవైపు తమన్నా విధిని నమ్మితే, మరోవైపు కళ్యాణ్‌రామ్‌ అలాంటి విషయాలని నమ్మనే నమ్మడు. పైగా వాటిని అతను వ్యతిరేకిస్తాడు కూడా. తమన్నా తన అదృష్టంగా భావించే కళ్యాణ్‌రామ్‌ని కలుసుకోవాలని చేసే ప్రయత్నాలు మన సహనానికి పరీక్ష పెడతాయి. చివరికి కళ్యాణ్‌రామ్‌ని కలిసిన తర్వాత, అతను ఓ పరీక్ష పెట్టనే పడతాడు. కళ్యాణ్‌రామ్‌కీ, తమన్నా తండ్రికీ మధ్య ట్రైన్‌లో జరిగే సన్నివేశాలు; తమన్నా, కళ్యాణ్‌రామ్‌లు చిన్నచిన్న విషయాలకి గొడవపడటాలు చికాకు తెప్పిస్తాయి. మరోవైపు ఒక్క క్లైమాక్స్‌ ముందు వచ్చే సన్నివేశంలో తప్ప, పోసాని కృష్ణమురళి ట్రాక్ కూడా బోర్ కొట్టిస్తుంది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా బిత్తిరి సత్తి పాత్ర ఏమాత్రం ఆకట్టుకోదు. ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌లు కూడా ఎలాంటి హాస్యాన్నీ పండించలేకపోయారు. మధ్యమధ్యలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. మొత్తంగా చిత్రం ఓ సానుకూల భావనతో ముగుస్తుంది.

నటన:

అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురుచూసే క్యాబ్‌డ్రైవరుగా కళ్యాణ్‌రామ్‌ తన పాత్రని బాగానే పోషించాడు. కానీ అతని కొత్త రూపం ఏమంత ఆకట్టుకునేలా లేదు. తమన్నా భాటియా తన స్టైలిష్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడూ అందాల ప్రదర్శన చేసేందుకు సంశయించలేదు. కళ్యాణ్‌రామ్‌, తమన్నాల డాన్స్‌ చాలా బాగుంది. హీరోయిన్‌ తండ్రిగా తనికెళ్ల భరణి మరో రొటీన్‌ పాత్ర చేశాడు. ఇక హీరోయిన్‌ తల్లిగా సురేఖ ఒదిగిపోయింది. పోసాని కృష్ణమురళి నటించేందుకు పెద్దగా ఆస్కారం లేకపోయింది. బిత్తిరి సత్తి బోర్‌ కొట్టేశాడు. ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌లను సరిగా ఉపయోగించుకోలేదు. మిగతా నటీనటులు తమ పరిధి మేర బాగానే నటించారు.

సాంకేతిక విలువలు:
తన తొలి సినిమా 180తో దర్శకుడిగా నిలదొక్కుకోలేకపోయిన జయేంద్ర మరోసారి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అటు రచయితగాను, ఇటు దర్శకునిగాను రాణించలేకపోయాడు. అతను కథని రాసుకునేందుకు శుభ సాయపడ్డాడు. మొత్తం చిత్రంలో అద్భుతం అనిపించదగ్గ సన్నివేశం ఒకటి కూడా కనిపించదు. శరత్‌ అందించిన సంగీతం బాగానే ఉంది. నేపథ్య సంగీతం అత్యద్భుతంగా సాగింది. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం కదిలిస్తుంది. ‘కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌’ నిర్మాణ విలువల సాధారణంగా ఉన్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నా నువ్వే తో కళ్యాణ్‌రామ్‌ మరోసారి నిరుత్సాహపరిచాడు. ఓ రెండు పాటలు, తమన్నా అందం అభినయం తప్ప ఈ చిత్రం గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25