English | Telugu

సినిమా పేరు:హుషారు
బ్యానర్:లక్కీ మీడియా
Rating:2.75
విడుదలయిన తేది:Dec 14, 2018

నటీనటులు: రాహుల్ రామకృష్ణ, తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే తదితరులు
నిర్మాణ సంస్థలు: లక్కీ మీడియా, హెచ్.కె. ఫిలిమ్స్, ఏషియన్ మూవీ క్రియేషన్స్  
కెమెరా:  రాజ్ తోట‌
సంగీతం:  ర‌థ‌న్
నిర్మాత‌లు: బెక్కం వేణుగోపాల్, రియాజ్
ద‌ర్శ‌క‌త్వం: శ్రీహర్ష కొనుగంటి
విడుదల తేదీ: డిసెంబర్ 14, 2018

`హుషారు` అంటూ యూత్ ఫుల్ టైటిల్ తో టీజ‌ర్ ద‌గ్గ‌ర నుంచ‌, ట్రైల‌ర్, పాట‌ల‌తో ఆక‌ట్టుకుందీ చిత్రం. బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా  శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం....

స్టోరిలోకి వెళితే...

స్ట‌డీ పై పెద్దగా ఇంట్ర‌స్ట్ లేని న‌లుగురు చై , ధృవ్, ఆర్య‌, బంటి లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. లైఫ్ లాంగ్ అలాగే ఎంజాయ్ చేస్తూ  క‌లిసి ఉండాల‌నుకుంటారు ఆ న‌లుగురు కుర్రాళ్లు. ఈ క్ర‌మంలో చై కి కాన్స‌ర్ అని తెలుస్తుంది.  వైద్యానికి చాలా ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు చెప్ప‌డంతో చైను బ్ర‌తికించుకోవ‌డం కోసం మిగిలిన ముగ్గురు మిత్రులు ఏం చేశారు? ఆఖ‌రికి వారు అనుకున్న‌ట్టుగానే క‌లిసి ఉన్నారా?  లేదా అన్న‌ది మిగ‌తా క‌థాంశం.


ఎనాలసిస్ :

న‌టీన‌టుల ప‌నితీరుః

  చై, ధృవ్, ఆర్య బంటీ క్యార‌క్ట‌ర్స్ , వారి న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింట్స్ గా నిలిచాయి. అంద‌రూ కొత్త వారు కావ‌డంతో  ఫ్రెష్ ఫీల్ క‌లిగింది. అలాగే రాహుల్ రామ‌కృష్ణ సినిమాకు మ‌రో హైలెట్ గా నిలిచాడు. త‌నదైన శైలిలో ,త‌న‌దైన కామెడీ టైమింగ్ తో సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు.

ప్లస్ పాయింట్స్:

కొత్త హీరోలు , వారి స‌హ‌జ‌మైన న‌ట‌న‌
 సంగీతం
 ఎమోష‌న‌ల్ మ‌రియు యూత్ ఫుల్ సీన్స్
దర్శకత్వం

మైనస్ పాయింట్స్:

  స్టోరి లైన్
  సెకండాఫ్

 సాంకేతిక నిపుణుల ప‌నితీరుః

డైర‌క్ట‌ర్ శ్రీ హ‌ర్ష రాసుకున్న స్టోరిలో అంత‌గా ఇన్నోవేటివ్ గా లేకున్నా...దాన్ని యూత్ కి క‌నెక్ట‌య్యేలా మ‌ల‌చ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి.  సినిమా ఫ‌స్టాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు.  ఇక ఉండిపోరాదే అంటూ పాట‌తో శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకున్న ర‌థ‌న్ త‌న పాట‌ల‌తో , నేప‌థ్య సంగీతంతో సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యాడు.  సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ కూడా బాగా కుదిరాయి. అలాగే నిర్మాత బెక్కం వేణుగోపాల్ క‌థ కు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఖ‌ర్చు పెట్టాడు.

 విశ్లేష‌ణః

  శ్రీ హ‌ర్ష రాసుకున్న క‌థ లో కొత్త‌ద‌నం లోపించ‌డం, ఊహాజ‌నితంగా ఉండ‌టంతో సెకండాఫ్ అంత‌గా ఇంట్ర‌స్ట్ ని క్రియేట్ చేయ‌లేకపోయింది.  యూత్ ని టార్గెట్ చేసుకుని క‌థ‌ను న‌డిపించాడు. దానికి త‌గ్గ‌ట్టుగా డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టాల్సి వ‌చ్చింది. దీంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ కొంత ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంది.  రాహుల్ రామ‌కృష్ణ తో చేసి హాస్య స‌న్నివేశాలు కొన్ని కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది.  సినిమాలో ల‌వ్ ట్రాక్ పై ద‌ర్శ‌కుడు దృష్టి సారిస్తే సినిమా  మ‌రో స్థాయిలో ఉండేది. ఫ‌స్ట్ లుక్ లో ప‌డిపోవ‌డం వంటి సీన్స్ రొటీన్ గా అనిపించాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైన‌ల్ గా ...

హుషారు సినిమా ఒక మంచి ప్ర‌య‌త్నం గా చెప్ప‌వ‌చ్చు.  ఫ్రెండ్ షిప్ లోని నిజాయితీ...న‌లుగురు కొత్త కుర్రాళ్ల స‌హ‌జ సిధ్ద‌మైన న‌టన , రొటీన్ క‌థ కొంత సినిమాకు మైన‌స్ అయినా...  ప్ర‌జంట్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా మ‌లిచిన ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ని మెచ్చుకోని తీరాలి. రాహుల్ రామ‌కృష్ణ కామెడీ, డీసెంట్ సాంగ్స్ తో సినిమా ఆద్యంతం అల‌రించే విధంగా ఉంటుంది.  యూత్ ని టార్గెట్ చేసి రూపొందించిన ఈ చిత్రం యూత్ కి న‌చ్చేలా మ‌ల‌చ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ...కానీ సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో చూడాలి.

సూటిగా చెప్పాలంటేః హుషారు

 

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25