English | Telugu

సినిమా పేరు:హ్యాపీ వెడ్డింగ్‌
బ్యానర్:యువి క్రియేషన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jul 28, 2018

త‌రాలు మారుతున్నా కొద్ది ప్రేమ‌, పెళ్లి అంశాల్లో యువ‌త‌రం దృక్ప‌థం మారుతూ వ‌స్తోంది.  స‌మాజ క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయ‌క విలువ‌ల కంటే త‌మ అంత‌రాత్మ నిర్ణ‌యం మేర‌కే నేటి త‌రం న‌డచుకుంటోంది. అయితే ఒక్కోసారి త‌మ బంధాల్లో త‌లెత్తె సంఘ‌ర్ష‌ణ‌, అభిప్రాయ‌భేదాల వ‌ల్ల క‌న్‌ప్జూజ‌న్‌కు గుర‌వుతున్నారు. సందిగ్ధంలోంచి బ‌య‌ట‌ప‌డ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇలాంటి అంశాల‌కు దృశ్య‌రూప‌మే హ్య‌పీ వెడ్డింగ్‌. సుమంత్ అశ్విన్‌, నిహారిక కొణిదెల జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి లక్ష్మ‌న్ కార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాకెట్ సినిమా సంస్థ నిర్మించింది. ప్రేమ‌, పెళ్లి నేప‌థ్యంలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం క‌థ వివ‌రాల్లోకి వెళితే..

క‌థ‌:

విజ‌య‌వాడ అబ్బాయి ఆనంద్‌ (సుమంత్ అశ్విన్‌),  హైద‌రాబాద్ అమ్మాయి అక్ష‌ర (నిహారిక‌) ప్రేమించుకొని పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తారు. నిశ్చితార్థానికి, పెళ్లికి మ‌ధ్య ఆరు నెల‌ల స‌మ‌యం ఉంటుంది. త‌మ ప్రేమబంధం విష‌యంలో అక్ష‌ర అభ‌ద్ర‌తాభావంతో వుంటుంది. ప్రేమించిన టైమ్‌లో అనంత్ త‌న‌తో ప్ర‌వ‌ర్తించిన‌ట్లుగా ఇప్ప‌డు వుండ‌టం లేద‌ని మ‌ద‌న‌ప‌డుతుంటుంది. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లుగా వారు బ్ర‌త‌కాల‌ని,  స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని అభిల‌షిస్తుంటాడు ఆనంద్‌. మ‌రోవైపు ఒక‌ప్పుడు త‌న‌తో బ్రేక‌ప్ తీసుకున్న విజ‌య్‌ను క‌లుసుకుంటుంది అక్ష‌ర‌. గ‌తంలో చేసిన త‌ప్పుల్ని మ‌న్నించి పెళ్లి గురించి ఆలోచించాల‌ని అక్ష‌ర‌ను కోర‌తాడు విజ‌య్‌. ఇద్ద‌రి ప్రేమ మ‌ధ్య అక్ష‌ర స‌త‌మ‌త‌మ‌వుతుంటుంది. పెళ్లి స‌మీస్తున్నా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా సందిగ్ధంలో ప‌డుతుంది. చివ‌ర‌కు అక్ష‌ర పెళ్లి విష‌యంలో ఏం జ‌రిగింది? ఏ సంఘ‌ట‌న‌లు ఆమెలో ప‌రివ‌ర్త‌న క‌లిగించాయి? ఇంత‌కి వెడ్డింగ్ హ్యాపీగా ముగిసిందా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా మిగ‌తా చిత్ర క‌థ న‌డుస్తుంది.


ఎనాలసిస్ :

ప్రేమ విష‌యంలో ఇన్‌సెక్యూర్‌గా ఫీల‌వుతూ ఎప్పుడూ కంప్లైంట్స్ చేసి ఓ అమ్మాయి, ఎలాంటి త‌ప్పులు చేసినా  పెద్ద మ‌న‌సుతో ఆలోచిస్తూ అమ్మాయిలో మార్పురావాల‌ని కోరుకునే అబ్బాయి. .ఇలా భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిసిన ఓ జంట క‌థ ఇది. ఈ ప్రేమ‌క‌థ‌కు  చ‌క్క‌టి కుటుంబ నేప‌థ్యాన్ని ఎంచ‌కున్నారు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను పాజిటివ్‌గా డిజైన్ చేశారు. ప్ర‌థ‌మార్థంలో ఆనంద్‌, విజ‌య్ ప్రేమ మ‌ధ్య సత‌మ‌త‌మ‌వుతూ ఎవ‌రిని ఎంచుకోవాలో అనే సంఘ‌ర్ష‌ణ‌లో అక్ష‌ర ప‌డే ఆవేద‌న‌ను భావోద్వేగంగా ఆవిష్క‌రించారు.  ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. అమ్మాయిల మ‌న‌స్త‌త్వాల‌కు, వాళ్ల భ‌యాల‌కు అద్దం ప‌డ‌తాయి. అయితే.... క‌థానాయ‌కుడు, నాయిక‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ అంత‌గా అత‌క‌లేదు.  అక్ష‌ర‌లోని భ‌యాలు అప్పుడ‌ప్పుడూ సిల్లీగా అనిపిస్తాయి.  పెళ్లి కొడుకు ఇంట్లో చాలా పాజిటీవ్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. అత్త‌మ్మ కూడా అమ్మ‌లా ఆద‌రిస్తుంది. `మీకు ప్రైవ‌సీ కావాలి క‌దా... అందుకే ఈ ఫ్లాట్ కొన్నాం` అని  తాళాల్ని కూడా కాబోయే కోడ‌లికి అప్ప‌గిస్తుంది అత్త‌మ్మ‌. ఇక అలాంటి చోట‌.. అమ్మాయిల‌కు భ‌యాలేముంటాయి?  హీరోయిన్ పాత్ర‌లో క‌న్‌ఫ్యూజ‌న్ ఉంది. దాన్ని తీర్చిదిద్ద‌డంలోనూ ద‌ర్శ‌కుడు క‌న్‌ఫ్యూజ్ అయిపోయాడు.  హీరో- హీరోయిన్లు దూర‌మైన‌ప్పుడే.. వాళ్లిద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తార‌ని ప్రేక్ష‌కుడికి తెలిసిపోతుంది. అదెలా?  అనేదే ఆస‌క్తిక‌రం. కొన్ని చోట్ల‌.. ఎమోష‌న్లు ఆక‌ట్టుకుంటాయి. అయితే.. అదే టెంపో సినిమా అంతా క‌నిపించ‌దు. అక్క‌డ‌క్క‌డ మ‌రీ... ఫోర్డ్స్‌గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల డైలాగులు బ‌లంగా రాశారు. ఇంకొన్ని చోట్ల టీవీ సీరియ‌ల్‌ని త‌ల‌పిస్తాయి. మొత్తానికి ఓ షార్ట్ ఫిల్మ్‌కి స‌రిపోయే క‌థ ప‌ట్టుకుని, దాన్ని సీరియెల్ మోడ్‌లో సినిమాగా మ‌లిచార‌నిపిస్తుంటుంది.

 

* న‌టీన‌టులు

సుమంత్ అశ్విన్ ఇంకా న‌ట‌న నేర్చుకోవాల‌నిపిస్తుంది. అత‌ని ఎక్స్‌ప్రెష‌న్స్ కొన్ని చోట్ల మ‌రీ ఓవ‌ర్‌గా అనిపిస్తాయి.  నిహారిక‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. అక్క‌డ‌క్క‌డ త‌డ‌బ‌డిగా... కొన్ని చోట్ల నిల‌బ‌డ‌గ‌లిగింది. ఇంకొన్ని చోట్ల మైన‌పు బొమ్మ‌లా నిల‌బిపోయింది.  న‌రేష్‌, ముర‌ళీ శ‌ర్మ ల‌కు ఇవి అల‌వాటైన పాత్ర‌లే. వాళ్ల‌ని ఛాలెంజ్ చేసే స‌న్నివేశాలేం లేవు.   మిగిలిన వాళ్లంతా అనుభ‌వ‌జ్ఞులే కాబ‌ట్టి.. ఎవ‌రి న‌ట‌నకీ వంక పెట్ట‌లేం.
 
* సాంకేతిక‌త‌

యూవీ లాంటి సంస్థ నుంచి... ఈ త‌ర‌హా లో బడ్జెట్ సినిమా వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూఊహించ‌రు. క‌థ‌కి ఇంత‌కు మించి అవ‌స‌రం లేద‌నుకున్నారో ఏమో...  అనుకున్న బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించాం.  ఎక్కువ చోట్ల మాట‌ల కంటే క‌విత్వం ఎక్కువ‌గా వినిపించింది. త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం మ‌రో ఆక‌ర్ష‌ణ‌.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

హ్యాపీ వెడ్డింగ్ ఓ అమ్మాయి క‌థ‌. అమ్మాయిల మ‌న‌స్త‌త్వాల్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ఆలోచ‌న బాగుంది. కాక‌పోతే.. మేగింగూ, టేటింగూ.. షార్ట్ ఫిల్మ్ స్థాయిలో ఉన్నాయి. దీన్ని కూడా నిహారిక స్థాయిలో వెబ్ సిరీస్‌లా మ‌లిస్తే బాగుండేదేమో.?

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25