English | Telugu

సినిమా పేరు:చెక్
బ్యానర్:భ‌వ్యా క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Feb 26, 2021

సినిమా పేరు: చెక్‌
తారాగ‌ణం: నితిన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, సాయిచంద్‌, సంప‌త్ రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీ శ‌ర్మ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రోహిత్‌, సిమ్రాన్ చౌద‌రి
స్టోరీ-స్క్రీన్‌ప్లే: చ‌ంద్ర‌శేఖ‌ర్ యేలేటి
సంగీతం: క‌ల్యాణీ మాలిక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాహుల్ శ్రీ‌వాత్స‌వ్‌
ఎడిటింగ్‌: అణ‌ల్ అనిరుద్ధ‌న్‌
ఆర్ట్‌: వివేక్ అన్నామ‌లై
నిర్మాత‌: వి. ఆనంద‌ప్రసాద్‌
ద‌ర్శ‌క‌త్వం: చ‌ంద్రశేఖ‌ర్ యేలేటి
విడుద‌ల తేదీ: 26 ఫిబ్ర‌వ‌రి 2021

కొన్ని దినాలకి ముందు వ‌చ్చిన ట్రైల‌ర్ చూసినంక 'చెక్' సిన్మాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మందిలో మ‌స్తుగ పెరిగిన‌య్‌. ఆ ట్రైల‌ర్‌తోనే మ‌న‌కి నితిన్ క్యారెక్ట‌ర్ ఏంట‌నేది స‌మ‌జైపోయింది. ఉరిశిక్ష ప‌డ్డ ఖైదీగా నితిన్ క‌నిప‌చ్చిండు. గ‌త‌డ్ని బ‌య‌ట‌కు తీస‌క‌రానీకి లాయ‌ర్‌గా యాక్ట్ జేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ శానా క‌ష్ట‌ప‌డ్డం అందులో చూసినం. మూస‌‌ సిన్మాలు తీయ‌డ‌నీ, విల‌క్ష‌ణ సిన్మాలు తీస్త‌డ‌నీ పేరు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి అలియాస్ చందు 'చెక్' మూవీని ఎట్ల తీసిండో చూసొద్దామా.. ప‌దండి మ‌ల్ల‌!

క‌థ‌
"యద్భావం తద్భవతి...  అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు."‌.. అనేది క‌ర్మ సిద్ధాంతం. గ‌యితే "అహం నియ‌తిం నిశ్చామి.. నా రాత‌ను నేనే రాసుకుంటాను." అనేది ఆదిత్య న‌మ్మిన‌ సూత్రం. ఈ సూత్రం మీద‌నే డైరెక్ట‌రు చందు 'చెక్' క‌త‌ను రాసుకుండు.  చేయ‌ని నేరానికి టెర్ర‌రిస్ట్‌గా ముద్ర‌ప‌డి ఉరిశిక్ష ప‌డిన ఆదిత్య జైలుకొస్తడు. గ‌త‌డి త‌ర‌పున వాదించ‌నీకి లాయ‌ర్ మాన‌స‌ వ‌స్తది. 

జైల్లో శ్రీ‌మ‌న్నారాయ‌ణ అ‌నే ఒగ పెద్దాయ‌న ద‌గ్గ‌ర చెస్ నేర్చుకొని టాప్ ప్లేయ‌ర్ అయిపోత‌డు ఆదిత్య‌. ఎస్పీ కోఆప‌రేష‌న్‌తోని టోర్న‌మెంట్ల‌లో పాల్గొని నేష‌న‌ల్ చాంపియ‌న్ అయిత‌డు. కానీ త‌ర్వాత ఆ ఎస్పీ ప్లేస్‌ల న‌ర‌సింహారెడ్డి అనే ఇంకో ఎస్పీ వ‌చ్చి, ఆదిత్య‌ను టార్గెట్ చేస్త‌డు. తను టెర్ర‌రిస్ట్‌ని కాద‌ని రుజువు చేసుకోనీకి ఆదిత్య‌కున్న‌ ర‌స్తాల‌న్నీ మూసుకుపోతయి. రాష్ట్ర‌ప‌తి క్ష‌మాభిక్ష ఒక్క‌టే మార్గ‌మ‌యిత‌ది. మ‌రి ఆ క్ష‌మాభిక్ష ఆదిత్య‌కి దొరుకుత‌దా, లేదా అనేదే 'చెక్' క‌త‌.


ఎనాలసిస్ :

90 ప‌ర్సెంట్ పైగా సిన్మా జైలులోనే న‌డుస్త‌ది. బ‌తుకుమీద ఆశ‌తోని ఆదిత్య ప‌డే త‌ప‌న‌, గ‌త‌ను చెక్ నేర్చుకొని టాప్ ప్లేయ‌ర్ అయ్యే  విధానం మంచిగ‌నే తీసిండు డైరెక్ట‌ర్‌. జైలులో త‌న‌దే అధికార‌మ‌న్న‌ట్లు హ‌ల్‌చ‌ల్ చేసే 'ట్రిగ్గ‌ర్' అనే బ్యాడ్ ఖైదీ, గ‌త‌ని బ్యాచ్ ఆదిత్య‌ని టార్గెట్ జేసి, మాటిమాటికీ లొల్లి పెట్టుకొనే సీన్లు ఏమంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చ‌లే. నేష‌న‌ల్ లెవ‌ల్ చెస్ టోర్న‌మెంట్‌లో ఆదిత్య గెలిచే సీన్లు మాత్రం మంచిగ అనిపిస్త‌య్‌. 

ఒక యూనిక్‌ స్టోరీకి త‌గ్గ‌ట్లు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే రాసుకొనుడులో డైరెక్ట‌ర్ కొద్దిగ‌నే స‌క్సెస్ అయ్యిండు.. మూవీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించ‌నీకి అది స‌రిపోలే. క్లైమాక్స్ చూసినంక గిట్ల‌కూడా జ‌రుగుత‌దా, గిది సాధ్య‌మ‌య్యే ప‌నేనా అనిపిస్త‌ది. దీనికోస‌మా ఇంత క‌త చెప్పింద‌నే డిజ‌ప్పాయింట్‌మెంట్ క‌లుగుత‌ది. క్లైమాక్స్‌తో ఆడియెన్స్ కనెక్ట‌వ‌డం క‌ష్ట‌మ‌బ్బా...

క్యారెక్ట‌రైజేష‌న్స్ కొన్ని చ‌క్కంగొస్తే, కొన్ని రాలే. క్లైమాక్స్‌ని ప‌క్క‌న‌పెడితే నితిన్ చేసిన హీరో ఆదిత్య క్యారెక్ట‌ర్‌‌, సాయిచంద్ చేసిన శ్రీ‌మ‌న్నారాయ‌ణ క్యారెక్ట‌ర్ బాగా వ‌చ్చిన‌య్‌. ఆదిత్య‌ను ఉరిశిక్ష నుంచి త‌ప్పించాల‌ని త‌పించే లాయ‌ర్ మాన‌స‌.. గ‌దే.. ర‌కుల్‌ప్రీత్ చేసిన క్యారెక్ట‌ర్ ఏమంత మంచిగ అనిపిచ్చ‌లేదు. ఆ రోల్‌ని ఎఫెక్టివ్‌గా మ‌ల‌చ‌లేక‌పోయిండు డైరెక్ట‌ర్‌. ఒక్క క‌న్నుగీటుతో నేష‌న‌ల్ క్ర‌ష్ ఐపోయిన‌ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ స‌ర్‌ప్రైజ్ అనిపిచ్చే యాత్ర అనే క్యారెక్ట‌ర్ల క‌నిపిచ్చి, మాయ‌మైత‌ది. ఆమె క్యారెక్ట‌ర్‌కు కూడా న్యాయం జ‌ర‌గ‌లే. ఆదిత్య‌తోని ఎప్పుడూ లొల్లి పెట్టుకొనే ట్రిగ్గ‌ర్ క్యారెక్ట‌ర్ ఓకే అనిపి‌స్త‌ది.

డైలాగ్స్ మాత్రం న‌రేశ్‌రెడ్డి అనే కొత్త రైట‌ర్ బాగానే రాసిండు. మెయిన్‌గ ఆదిత్య‌కు, అత‌నికి చెస్ నేర్పించిన శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌కి మ‌ధ్య రాసిన సీన్ల‌ల్ల డైలాగ్స్ మంచిగున్న‌య్ అనిపిస్త‌ది. గీ రైట‌ర్‌కు మంచి ఫ్యూచ‌రుంట‌ది. సిన్మాల మంచిగ అనిపిచ్చే ఎలిమెంట్స్‌ల క‌ల్యాణీ మాలిక్ మ్యూజిక్ ముందుంట‌ది. నితిన్‌, ప్రియా ప్ర‌కాశ్‌పై తీసిన "నిన్నుచూడ‌క నేనుండ‌లేను" అనే ఒక్క‌పాట‌కు మంచిగ ట్యూన్స్ ఇచ్చిండు. బ్యాగ్రౌండ్ స్కోర్ మ‌స్తుగ కొట్టిండు. 'చెక్' సిన్మాకి ఈ మ్యూజిక్ ఓ బ‌లం. 

గ‌ట్ల‌నే రాహుల్ శ్రీ‌వాత్స‌వ్ సినిమాటోగ్ర‌ఫీ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది మ‌ల్ల‌. టెక్నిక‌ల్‌గా సిన్మా స్ట్రాంగ్‌గా అనిపిచ్చిందంటే కెమెరా ప‌నిత‌నం వ‌ల్ల‌నే. అణ‌ల్ అనిరుద్ధ‌న్ ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. వివేక్ అన్నామ‌లై ఆర్ట్ వ‌ర్క్ గురించి చెప్పుకోవాల‌. జైలు సెట్‌ను మంచిగ ఏసిండు. జైలు లోప‌ట‌ ఎట్లుంట‌దో మ‌న‌కు పూరా స‌మ‌జ్ అయ్యేట్లు చేసిండు. జైల్లో ఫైట్లు మాస్ ఆడియెన్స్‌ని మెప్పిస్త‌యి. ఓవ‌రాల్‌గా భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ మాత్రం మెచ్చుకోవాలె.

న‌టీన‌టుల అభిన‌యం
తెర‌మీద 'చెక్' అనేది ఒన్ మ్యాన్ షో అబ్బా.. అంటే సిన్మా అంతా ఆదిత్య క్యారెక్ట‌ర్ల నితినే క‌నిపిస్త‌డు. ఇంత‌కుముందెప్పుడూ చెయ్య‌ని ఉరిశిక్ష ప‌డ్డ ఖైదీగా సీరియ‌స్ క్యారెక్ట‌ర్‌ను బాగా చేసిండు. నితిన్ ప‌ర్ఫార్మెన్స్ కోస‌మైనా ఒక్క‌సారి ఈ సిన్మా చూడొచ్చ‌నిపిస్త‌ది. ర‌కుల్ ప్రీత్‌కు యాక్ట్ జెయ్య‌డానికి ఎక్కువ స్కోప్ దొర‌క‌లే. ప్రియా ప్ర‌కాశ్ ఓ పాట‌, నాలుగైదు సీన్ల‌ల క‌నిపిచ్చి, మురిపిచ్చింది. నాకైతే ఆమె క్యారెక్ట‌ర్ ఇంకొంచెం ఉంటే బాగ‌నిపిచ్చింది. 

ఆదిత్య చెస్ గురువు శ్రీ‌మ‌న్నారాయ‌ణ పాత్ర‌ల సాయిచంద్ మ‌స్తు యాక్ట్ జేసిండు. ప‌ర్ఫార్మెన్స్ విష‌యానికొస్తే, ఆయ‌న‌కే అంద‌రికంటే ఎక్కువ మార్కులు ఎయ్యాల‌. జైలు సూప‌రింటెండెంట్లుగా ముర‌ళీశ‌ర్మ‌, సంప‌త్ రాజ్ త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చిన్రు. సీనియ‌ర్ లాయ‌ర్‌గా, మాన‌స ఫాద‌ర్‌గా పోసాని మార్క్ యాక్టింగ్ క‌నిపిచ్చ‌లే. బ్యాడ్ ఖైదీ ట్రిగ్గ‌ర్ క్యారెక్ట‌ర్‌ని రోహిత్ పాఠ‌క్ బాగానే చేసిండు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఒక్క లైన్ల.. ‌స్టిఫికేష‌న్ ల‌భించ‌ని అసంపూర్తి స్టోరీ 'చెక్' అని చెప్పాల‌బ్బా...

 

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25