English | Telugu

సినిమా పేరు:అ!
బ్యానర్:వాల్‌పోస్టర్ సినిమా
Rating:1.50
విడుదలయిన తేది:Feb 16, 2018

సినిమా: అ!
తారాగణం: కాజల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, కౌశిక్...
దర్శకత్వం:  ప్రశాంత్ వర్మ 
నిర్మాత: నాని


కొత్తగా చేయడమంటే... సాధారణ ప్రేక్షకునికి అర్థం కానంత కొత్తగా చేయడం కాదు. ముందు తీసుకున్న కాన్సెప్ట్ సామాన్యుడికి డైజస్ట్ అయ్యేలా ఉండాలి. కొత్త అనుభూతికి లోనయ్యేలా చేయాలి. కథ భూమ్మీద నడవాలి. అంతేకానీ... మెదడుకు మేత పెట్టేలా ఉండకూడదు. కాసేపు ఎంజాయ్ చేయడానికి వచ్చిన జనాల ముందు ప్రతిభను ప్రదర్శిస్తే ఎలా?   తీస్తే ఊర సినిమా చేస్తారా!. లేకపోతే సామన్యుడికి ఆమడదూరం ఉన్న కాన్సెప్ట్‌ని ఎంచుకొని సినిమాలు తీస్తారా!. జనం మెచ్చేలా కొత్తగా సినిమాలు చేయలేరా? శుక్రవారం విడుదలైన సినిమాలు చూసిన ప్రేక్షకుల మనోగతం ఇది. 

కాజల్, రెజీనా, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, కౌశిక్ ప్రధానపాత్రధారులుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అ‘. హీరో నాని ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. హీరోగా మంచి స్పీడ్ మీదున్న నాని.. ఎందుకు ఈ సినిమా కోసం నిర్మాతగా మారాడు? అతనికి అంత బాగా నచ్చిన అంశం ఈ కథలో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ముందు కథలోకెళ్దాం. 

కథ:

ఓ ఫుడ్ కోర్ట్ లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా.  ఒకడు ఉద్యోగం కోసం అక్కడకొస్తాడు. . ఒకడు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వస్తాడు. ఓ మిజీషియన్, ఓ పాప, ఓ ప్రౌఢ స్త్రీ, ఇద్దరు అమ్మాయిలు (లెస్బీయాన్స్), టైమిషీన్ కనుక్కుంటానంటున్న ఓ గేట్ బోయ్, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన ఓ అమ్మాయి.. ఇలా వివిధ రకాల వ్యక్తులు ఆ ఫుడ్ కోర్ట్ లో కనిపిస్తుంటారు. అక్కడ ఊహించని సంఘటనలు జరగుతుంటాయ్. అసలు వీళ్లంతా అక్కడ ఎందుకున్నారు? అసలు వీరెవరు? అనేది ఈ కథలో మెయిన్ పాయింట్.
 


ఎనాలసిస్ :

నిద్రలో ఒక్కోసారి పీడకలలు వస్తుంటాయ్. పొద్దున్నే లేచాక అవి గుర్తొస్తే... తలంతా పట్టేసిన ఫీలింగ్. ఈ సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకులది అదే పరిస్థితి. దర్శకుడు కొత్తగా ప్రయత్నం చేశాడు. కొత్తగా ఆలోచించాడు కూడా. అయితే... అతని ప్రయత్నం సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. తెరపై పాత్రలన్నీ అసహజంగా ప్రవర్తిస్తుంటే... ఏమీ అర్థం కాక  జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. తీరా అసలు విషయం తెలిశాక... దాన్ని అద్భుతంగా ఫీలవ్వాల్సిన ఆడియన్... అసహనానికి లోనవుతాడు. 

దర్శకుడు ప్రశాంత్ వర్మ పై ఇంగ్లిష్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుంది. ఓ దశలో ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమా చూస్తున్నామా? అనే డౌట్ కూడా కలిగించాడు. సాంకేతికంగా.. టేకింగ్ పరంగా తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తే అందరికీ ఆనందమే కానీ..  నేటివిటీని వదిలేసి హాలీవుడ్ నేటివిటీతో సినిమాలు చేస్తే ఎవరూ హర్షించరు. ఇది ప్రతి దర్శకుడూ గమనించాలి. నటీనటులు కొత్తగా చేయడానికి ఇందులో ఏమీ లేదు. సాంకేతికంగా సినిమా బావుంది. 

టోటల్ గా చెప్పేదేంటంటే... హారర్ మిళితమైన సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏ క్లాస్ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నమ్మకం లేదు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

’అ‘సహనానికి లోనవ్వాల్సిందే!

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25