English | Telugu

సినిమా పేరు:యాక్షన్
బ్యానర్: శ్రీ కార్తికేయ సినిమాస్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 15, 2019

సినిమా పేరు: యాక్షన్
బ్యానర్: శ్రీ కార్తికేయ సినిమాస్
తారాగణం: విశాల్, తమన్నా, కబీర్ దుహాన్ సింగ్, ఆకాంక్షా పురి, ఐశ్వర్యలక్ష్మి, సాయాజీ షిండే, యోగిబాబు, రాంకీ, ఛాయా సింగ్, షా రా, భరత్‌రెడ్డి
సంగీతం: హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: డుడ్లీ
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుందర్ సి.
విడుదల తేదీ: 15 నవంబర్ 2019


తెలుగునాట ప్రాచుర్యం పొందిన తమిళ హీరోల్లో విశాల్ ముందు వరుసలో ఉంటాడు. ఆ మధ్య 'అభిమన్యుడు' మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న అతను, 'పందెంకోడి 2', 'అయోగ్య' ('టెంపర్' రీమేక్)లతో ఒకింత నిరుత్సాహపరిచాడు. ఈ నేపథ్యంలో సుందర్ సి. డైరెక్షన్‌లో అతను చేసిన 'యాక్షన్' మూవీపై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. కారణం.. ఆ మూవీ ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉండటం. భారీ యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు ఉన్నాయని ఆశలు రేపిన 'యాక్షన్' మూవీ నవంబర్ 15న మన ముందుకు వచ్చేసింది. మరి బొమ్మ ఎలా ఉందయ్యా అంటే...

కథ
ఒక బాంబ్ బ్లాస్ట్‌లో తన కుటుంబ సభ్యురాలిని కోల్పోతాడు కల్నల్ సుభాష్ (విశాల్). అతని తండ్రి సీఎం. ఈ బ్లాస్ట్ వెనుక సుభాష్ అన్న శ్రావణ్ (రాంకీ) ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. శ్రావణ్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. బాంబ్ బ్లాస్ట్, తన కుటుంబసభ్యుల మరణం వెనుక ఎవరున్నారనే తీగ కదిలిస్తాడు సుభాష్. డొంక కదిలి ప్రొఫెషనల్ కిల్లర్ కైరా (ఆకాంక్షా పురి) నుంచి పాకిస్తానీ టెర్రరిస్ట్ మాలిక్ (కబీర్ దుహాన్ సింగ్) దాకా మూలాలు వెళ్తాయి. సుభాష్ తన వ్యక్తిగత పగ తీర్చుకోవడంతో పాటు, దేశానికి ఎలా పేరు తెచ్చాడనేది మిగతా కథ.

 


ఎనాలసిస్ :

బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన 'బేబీ' (2015) సినిమా పోలికలు 'యాక్షన్'లో కనిపిస్తాయి. 'యాక్షన్' సెకండాఫ్ చూస్తుంటే మనకు 'బేబీ' కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. దానికీ, దీనికీ ఉన్న వ్యత్యాసాలు.. అందులో అక్షయ్‌కి తాప్సీ ఒక కొలీగ్‌గా మాత్రమే కనిపిస్తే, ఇక్కడ విశాల్‌కి తమన్నా లవ్ ఇంట్రెస్ట్‌గా కనిపిస్తుంది. అందులో ఫ్యామిలీ ఎలిమెంట్ ఉండదు. ఇందులో ఉంటుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. టైటిల్‌కు తగ్గట్లుగా యాక్షన్ సీన్స్‌ను టాప్ క్లాస్‌లో డిజైన్ చేసి చిత్రీకరించారు. ఇంటర్వెల్‌కు ముందు విశాల్, ఆకాంక్ష మధ్య తీసిన యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాలు, తర్వాత వచ్చే సీన్లు కొంచెం డిస్టర్బింగ్‌గా ఉన్నాయనుకొనేంతలో యోగిబాబు ఎంట్రీ ఇచ్చి, కథని గాడిలో పెట్టాడు. అక్కడ్నుంచి ఇంటర్వెల్ పడేంత వరకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, సూపర్బ్ యాక్షన్ సీన్స్‌తో సినిమాని ఆసక్తి కరంగా నడిపాడు డైరెక్టర్ సుందర్. కథ లండన్‌లో ఉన్న కైరా నుంచి, అట్నుంచి దీపక్ మెహతా ఉన్న ఇస్తాంబుల్‌కు, అట్నుంచి లాహోర్‌కు మారాక 'లాగింగ్' అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్లు వచ్చేదాకా మనం కాస్త ఓపికతో ఉండాల్సిందే. క్లైమాక్స్ సీన్లను ఊపిరి బిగపట్టేలా తియ్యడంలో సఫలం చెందాడు డైరెక్టర్. ఈలోగా లాజిక్‌కు అందని ఎన్నో విషయాలు మనల్ని అబ్బురపరుస్తుంటాయి. ఇస్తాంబుల్‌లో దీపక్ మెహతా అనేవాడ్ని పట్టుకొనే యత్నంలో అక్కడి పోలీసుల్నే మన హీరో చావగొట్టి, తప్పించుకోవడం ఒక 'అద్భుతం'. ఇలాంటి 'అద్భుతాలు' కథ లాహోర్‌కి వెళ్లాక కూడా చాలానే జరుగుతుంటాయి. ఒక భారతీయుడు పాకిస్తాన్‌కు వెళ్లి, అక్కడి మిలటరీనీ, టెర్రరిస్టుల్నీ బురిడీ కొట్టించడం ఎంత ఈజీనో.. 'యాక్షన్' చూపిస్తుంది. సినిమాలో మూడే పాటలున్నాయి. ఒక పాటలో ఆకాంక్షా పురి అందాలను, ఇంకో పాటలో తమన్నా వంపుసొంపులను చూడొచ్చు. అంటే అవి కంటికింపే కానీ, శ్రవణానందం కలిగించేవి కావు. హిప్‌హాప్ తమిళ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాకు సంబంధించిన మరో ప్లస్ పాయింట్ డుడ్లీ సినిమాటోగ్రఫీ. యాక్షన్ సీన్లను అతను చిత్రీకరించిన విధానం సూపర్బ్.

ప్లస్ పాయింట్స్
విశాల్, తమన్నా నటన
యాక్షన్ ఎపిసోడ్స్
ప్రొడక్షన్ వాల్యూస్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
ఓవర్‌గా అనిపించే బాంబ్ బ్లాస్ట్ సీన్స్
సాగతీత ఎక్కువైన సెకండాఫ్
లాజిక్‌కు అందని సీన్లు
హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు లేకపోవడం

నటీనటుల అభినయం
కల్నల్ సుభాష్‌గా విశాల్ రాణించాడు. ఎమోషనల్ సీన్స్‌ను ఎంతగా పండించాడో, హాక్షన్ ఎపిసోడ్‌లో అంత వేగాన్ని కనపరచి, యాక్షన్ హీరో అనిపించుకున్నాడు. సుభాష్‌ను ఇష్టపడే, అతని ఆపరేషన్‌కు సాయపడే ప్రియ పాత్రలో తమన్నా ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్‌కు తగ్గ సీరియస్‌నెస్‌ను చూపించింది. టెర్రరిస్ట్ మాలిక్‌గా కబీర్ దుహాన్ సింగ్ సరిపోయాడు. సుభాష్ బావగా షా రా అలరించాడు. యోగిబాబు కంటే కూడా షా రాకే ఎక్కువ మార్కులు పడతాయి. సుభాష్ పై అధికారిగా కనిపించిన సాయాజీ షిండేకు నటించడానికి అవకాశం రాలేదు. కైరాగా చేసిన ఆకాంక్షా పురి ఒక లైవ్ వైర్‌లా మెరిసింది. నెగటివ్ రోల్‌కు అతికినట్లు సరిపోయింది. అతిథి పాత్రలకు ఎక్కువా, ప్రధాన పాత్రలకు తక్కువా అని చెప్పదగ్గ పాత్రల్లో రాంకీ, ఐశ్వర్యలక్ష్మి పరిధుల మేరకు నటించారు. రాంకీ భార్యగా ఛాయా సింగ్ ఇంప్రెసివ్‌గా కనిపిస్తుంది. 

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

యాక్షన్ సినిమాల్ని ప్రేమించే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. 'యాక్షన్' బలమంతా ఆ తరహా సన్నివేశాల్లోనే ఉంది. బాలీవుడ్ 'బేబీ'ని చూడనివాళ్లు ఈ సినిమాని ఓసారి చూడొచ్చు.

- బుద్ధి యజ్ఞమూర్తి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25