English | Telugu

సినిమా పేరు:త్రీ మంకీస్‌
బ్యానర్:orugallu cine creations
Rating:1.25
విడుదలయిన తేది:Feb 7, 2020

నటీనటులు: ‘సుడిగాలి’ సుధీర్‌, ‘ఆటో’ రామ్‌ప్రసాద్‌, ‘గెటప్‌’ శ్రీను, కారుణ్య చౌదరి తదితరులు
మాటలు: అరుణ్‌. వి
పాటలు: శ్రీమణి
సినిమాటోగ్రఫీ: సన్నీ దోమల
నిర్మాత: నగేశ్‌. జి
కథ–స్ర్కీన్‌ ప్లే–సంగీతం–దర్శకత్వం: అనిల్‌ కుమార్‌. జి
విడుదల తేదీ: 07 ఫిబ్రవరి 2020

‘జబర్దస్త్‌’తో ‘సుడిగాలి’ సుధీర్‌, ‘ఆటో’ రామ్‌ప్రసాద్‌, ‘గెటప్‌’ శ్రీను ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపే హీరోలుగా నటించే ఛాన్స్‌ తెచ్చి పెట్టింది. ‘జబర్దస్త్‌’ స్కిట్‌ అయితే 10 మినిట్సే. అందులో పది పంచ్‌ డైలాగులు పడితే చాలు. కథ ఏమీ అవసరం లేదు. సినిమాకు వస్తే... రెండున్నర గంటలు. అందులో కథ, కథనం, నటన వంటివి ఎన్నో ఉంటాయి. ప్రతివారం టీవీ షోతో 10 మినిట్స్‌ నవ్వించే వీళ్లు... రెండున్నర గంటలు ఏం చేశారు? సినిమా ఎలా ఉంది? చూడండి.

కథ:

సంతోష్‌ (‘సుడిగాలి’ సుధీర్‌) మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌. ఆనంద్‌ (‘ఆటో’ రామ్‌ప్రసాద్‌) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఫణి (‘గెటప్‌’ శ్రీను) దర్శకుడు కావాలనుకుని కలలు కనే యువకుడు. ముగ్గురూ స్నేహితులు. ఒకరోజు సంతోష్‌ని అతడి బాస్‌ వైఫ్‌ ఇంటికి పిలుస్తుంది. అసలు మేటర్‌ దగ్గరకు వచ్చేసరికి అతడిలో మేటర్‌ లేదని తెలుస్తుంది. సంతోష్‌ ఎంత ప్రయత్నించినా... విషయం దగ్గరకు వచ్చేసరికి వీక్‌ అవుతాడు. అతడికి ఎరెక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ అన్నమాట! అది నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి ముగ్గురు స్నేహితులు ఓ వేశ్య (కారుణ్య చౌదరి)ని బుక్‌ చేసుకుంటారు. అనూహ్యంగా ఆమె మరణిస్తుంది. వేశ్య మరణానికి కారకులు ఎవరు? ఆమె మరణంతో ముగ్గురు స్నేహితులు పడిన ఇబ్బందులు ఏమిటి? ఈ సమస్య నుండి వాళ్లు ఎలా గట్టెక్కారు? అనేది సినిమా.


ఎనాలసిస్ :

‘బాయ్స్‌’ సినిమా చూశారా? అందులో హీరోతో పాటు మిగతా స్నేహితులు కలిసి ఒక వేశ్యను బుక్‌ చేసుకుంటారు. రీసెంట్‌గా వచ్చిన ‘మత్తు వదలరా’ చూశారా? హీరో ఏం చేయకుండా బామ్మ మరణిస్తుంది. ముందు మరణించిందని హీరో అనుకుంటాడు. ఆ కేసు నుండి తప్పించుకోవాలని హీరో నానా తంటాలు పడతాడు. ఈ రెండు ఐడియాలను మిక్స్‌ చేసి కొన్ని మార్పులు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శకుడికి వచ్చిందేమో? లేదంటే ఆయనకు అంతకు ముందే ఈ ఐడియా వచ్చిందో? ఆ ఆలోచనలో హీరోలుగా ‘జబర్దస్త్‌’ వాళ్లను పెట్టి కామెడీగా తీస్తే మార్కెటింగ్‌ చేసుకోవచ్చని నిర్మాత అనుకున్నారేమో? ఏది ఏమైనా పేపర్‌ మీద ఎగ్జైట్‌ చేసిన ఐడియా, సినిమాగా తీసేసరికి ఫెయిలైంది. ఐడియా పరంగా ‘త్రీ మంకీస్‌’ పర్వాలేదు. కానీ, ఎగ్జిక్యూషన్‌ ఏమాత్రం బాలేదు. ‘జబర్దస్త్‌’లో కామెడీ చేయాలని కొన్నిసార్లు అడల్డ్‌ కంటెంట్‌ జోకులు వేస్తారు. అలాగే అడల్ట్‌ కంటెంట్‌ సీన్స్‌తో ఈ సినిమా తీశారు. హీరోలు ముగ్గురు బాగా నటించినా... సన్నివేశాల్లో పస లేకపోవడంతో తేలిపోయాయి. ఎరెక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ కాన్సెప్ట్‌తో హిందీలో ‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’ అనే మంచి సినిమా తీశారు. దాన్ని తీసుకుని ఎంత కంగాళీ చేయాలో? అంతా ‘త్రీ మంకీస్‌’లో చేశారు. స్ర్కీన్‌ప్లేలో ఏం జరుగుతుందో చాలాసార్లు ప్రేక్షకులు ముందే ఊహించగలరు. సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎడిటింగ్‌లో కత్తెర వేయాల్సిన చాలా సన్నివేశాలను వదిలేశారు. సాంకేతిక విభాగంలో చెప్పుకోదగ్గ పనితీరు ఎవరూ కనబరచలేదు.

ప్లస్‌ పాయింట్స్‌:
సుధీర్‌, శ్రీను, రామ్‌ప్రసాద్‌ నటన, కామెడీ టైమింగ్‌
కొన్ని కామెడీ సీన్లు

మైనస్‌ పాయింట్స్‌:
బలహీనమైన కథ
ఊహించదగ్గ కథనం
ఏమాత్రం పసలేని దర్శకత్వం
పాటలు, మాటలు, సంగీతం
ఎడిటింగ్‌

నటీనటులు:

సుధీర్‌, రామ్‌ప్రసాద్‌లో మంచి కామెడీ టైమింగ్‌ ఉందని తెలుసు. శ్రీను గెటప్పులు బాగా వేస్తాడని తెలుసు. థ్యాంక్స్‌ టు జబర్దస్ట్‌. ఈ ముగ్గురు ఎమోషనల్‌ సీన్స్‌ బాగా చేస్తారని ‘త్రీ మంకీస్‌’ నిరూపించింది. కారుణ్య చౌదరి పాత్రకు తగ్గట్టు నటించారు. మిగతా నటీనటుల్లో రిజిస్టర్‌ అయ్యేవారు తక్కువ.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

‘త్రీ మంకీస్‌’లో ‘జబర్దస్త్‌’కు మించి ‘సుడిగాలి’ సుధీర్‌, ‘ఆటో’ రామ్‌ప్రసాద్‌, ‘గెటప్‌’ శ్రీను కామెడీ చేస్తారని ఆశిస్తే... నిరాశ తప్పదు. అలాగని, సినిమాకు ఉండాల్సిన కథ, కథనం, దర్శకత్వం ఎక్స్‌పెక్ట్‌ చేసినా డిజప్పాయుంట్‌ అవ్వడం ఖాయం. అడల్డ్‌ కామెడీ కాన్సెప్ట్‌తో కూడిన ఫిల్మ్‌ ఇది. అదీ... ఇదీ... ఏదీ పూర్తిగా చూపించకుండా కిచిడీ కిచిడీ చేశారు. నవ్వులు లేవు... ఎమోషనూ లేదు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25