English | Telugu
జగన్ సార్ జగన్ అంతే!
Updated : Aug 25, 2025
కనీసం కులాభిమానం కూడా లేదా? జగనన్నా.. నువ్వా కులపోడివే కావా? అంటూ సోషల్ మీడియాలో రచ్చ. ఇంతకీ అసలేం జరిగిందంటే.. అజాత శతృవు సురవరం సుధాకర్ రెడ్డిపై జగన్ కి ఎనిమిదేళ్ల నాటి పగ ఉన్నట్టుగా చెబుతున్నారు. అందువల్లే జగన్ తానెంతో ఖాళీగా బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లో పడి ఉన్నా నివాళి అర్పించడానికి రాలేదని అంటున్నారు.
తనపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టిందని, తన పార్టీ నుంచి టీడీపీకి ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశారని మద్దతు అడగటానికి ఢిల్లీలో సురవరం సుధాకర్ రెడ్డిని కలవడానికి పార్టీ నాయకులతో సహా వెళ్లారు జగన్..
సురవరం మద్దతు ఇచ్చారా లేదా? అటుంచితే ఆయన జగన్ తో తప్ప అందరికీ కరచాలనం చేశారు. ఈ ఘటన అత్యంత దారుణమైన అవమానకరమైన ఘటనగా తనమైండ్లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు జగన్. ఆ తర్వాత ఎప్పుడూ సురవరం సుధాకర్ రెడ్డిని కలవలేదు జగన్.
రాజకీయంగా ఎంతో సైద్ధాంతిక వైరుధ్యం గల బీజేపీకి చెందిన వారెందరో సురవరంకి నివాళి అర్పించడానికి వచ్చారు. చివరికి వెంకయ్యనాయుడు వంటి బీజేపీ కురువృద్ధులు కూడా వచ్చి తెలుగు కమ్యూనిస్టు దిగ్గజం, రెండు సార్లు ఎంపీ, సీపీఐ జాతీయ కార్యదర్శి అయిన సురవరం కి నివాళులు అర్పించడానికి వచ్చారు. కానీ జగన్ మాత్రం రాలేదు.
అప్పటికీ జగన్ కి ఈ విషయం తెలియ చేసినా తాను రానని తెగేసి చెప్పారట జగన్. అయినా చనిపోయిన వాళ్లతో కూడా శతృత్వం ఏంటి జగనన్నా! అంటూ వారు లోలోపల బాధ పడ్డా ఆయనైతే ఖరాకండిగా రానని చెప్పేశారట. దీంతో పార్టీ తరఫున.. అయోధ్య రామిరెడ్డి, మేకపాటి రాజమనోహర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రం హాజరయ్యారు. అదే సమయంలో ఈ విషయాలేవీ తెలియని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్, జగన్ పేరిట మొక్కుబడిగా ఒక సానుభూతి ప్రకటన రిలీజ్ చేయడంతో సరిపెట్టారు.
తాను సీఎంగా ఉండగా మరణించిన మాజీ సీఎం రోశయ్య మీద కూడా సరిగ్గా ఇలాగే కోపం చల్లారని జగన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించడానికి ససేమిరా అన్నారు. కడసారి చూపునకూ రాకుండా మొహం చాటేశారు జగన్.జగన్ అంతే.. ఆయనకు కనీస రాజకీయ విచక్షణా జ్ఞానం కానీ, హుందా తనంగానీ, ఒక రాజకీయ అవగాహన కానీ లేవని అంటారు..