English | Telugu

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్

వినాయక చవితికి ఏర్పాటు చేసే గణేశ్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా 15 వేలకుపైగా గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రభుత్వంపై రూ. 25 కోట్ల భారం పడనుంది. వినాయక మండపాలకు విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేశ్ తెలిపారు.

మంత్రి చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి జీఓ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.