English | Telugu

గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల స్కామ్

తెలంగాణలో సంచలన సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులు సీజ్‌ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్‌ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్‌ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని ఈడీ తెలిపింది.