English | Telugu
పయ్యావులకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందే.. హైకోర్టు స్పష్టీకరణ
Updated : Feb 22, 2023
నిబంధనల మేరకు ప్రతి మూడేళ్ల కోసారి ప్రజాప్రతినిథుల వ్యక్తిగత భద్రతా సిబ్బందిని బదలీ చేయడం సహజమని, అందులో భాగంగానే పయ్యావుల భద్రతా సిబ్బంది బదలీ జరిగిందనీ వివరించింది. త్వరలోనే ఆయనకు భద్రతా సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది.
సరే పయ్యావులకు ఇప్పటి వరకూ భద్రత కల్పించలేదు. దీనిపై పయ్యవుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.
ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటీషనర్ కు సూచించింది. వారిలో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేంలా ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది.
గతంలో విచారణకు వచ్చిన సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా, ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే పిటీషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల ప్రభుత్వ న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చింది. పిటీషనర్ కు నమ్మకం ఉండాలి కదా అని వ్యాఖ్యానించిన హైకోర్టుతొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడం పై తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.