English | Telugu

భావనపాడు తీరంలో భారీ నౌక

శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరంలో భారీ నౌక డిజైర్ లంగరేసింది. ఇక్కడి మూలపేట ప్రాంతంలో గత నెల రోజులుగా మూలపేట పోర్టు ఆధారిత సముద్ర తీర ప్రాంతాల్లో సాయిల్ టెస్టులు నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే.

అందు కోసం ఈ డిజైర్ నౌక గత నెల రోజులుగా పనిచేస్తోంది. ఆ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరమ్మతుల కోసం నౌకను తీరానికి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు.

భారీ నౌకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలు ప్రజలు భావనపాడు తీరానికి చేరుకున్నారు. ఈ నౌక వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ, అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనీ, ఇది భారత ప్రభుత్వాని చెందిన నౌకేననీ మెరైన్ సీఐ తెలిపారు. మరమ్మతులు పూర్తి కాగానే తీరం నుంచి వెళ్లిపోతుందని వివరించారు.