English | Telugu

పులివెందులలో నేడు రీ-పోలింగ్

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మంగళవారం (ఆగస్టు 12)న జరిగిన ఉప ఎన్నికలో రెండు పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు, రిగ్గింగ్ జరిగాయన్న ఆరోపణలతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆ రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం (ఆగస్టు 13) రీపోలింగ్ జరుగుతోంది.

ఉదయం ఏడు గంటలకు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ సాగుతుంది. రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం (ఆగస్టు 14) కడపలో జరగనుంది.