English | Telugu
దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్
Updated : Aug 14, 2025
భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలలో రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో గొడుగనిపల్లి పెద్దవాగు ,బడెంపల్లి పెద్దవాగులు , దోమ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
దీంతో దోమ, పాలేపల్లి రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే పగిరి, మహబూబ్ నగర్ గడి సింగాపూర్ రామిరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు వాగులూ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ రహదారులపై పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.