English | Telugu

చిరంజీవి సిస్టర్ గా స్టార్ హీరోయిన్! ఎంత రెమ్యునరేషన్ అడిగిందో తెలుసా!

'విశ్వంభర' తర్వాత 'మెగాస్టార్ చిరంజీవి'(Chiranjeevi)స్టార్ డైరెక్టర్ 'అనిల్ రావిపూడి'(Anil Ravipudi)దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అధికారకంగా కూడా ప్రారంభమైన ఈ మూవీ త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. చిరంజీవి మినహాయిస్తే మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అనిల్ రావిపూడి ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో వైజాగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ మూవీలో 'చిరంజీవి' రోల్ కి సంబంధించి ఒక సిస్టర్ క్యారక్టర్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కోణంలో సాగే ఆ సిస్టర్ రోల్ కి, ప్రముఖ తమిళ నటి, హీరో సూర్య వైఫ్ జ్యోతిక పేరుని మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర బృందం ఈ విషయాన్ని త్వరలోనే అధికారకంగా ప్రకటిస్తారని కూడా అంటున్నారు. చిరు బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన 'ఠాగూర్' లో చిరు, జ్యోతిక జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరి కాంబో సినిమాకి మంచి హెల్ప్ అయ్యింది. ఈ నేపథ్యంలో జ్యోతిక(Jyothika)చిరు సోదరిగా చెయ్యడం ఖాయమైతే ఒక సంచలనం నమోదయినట్టే.

వివాహం తర్వాత సినిమాలకి దూరంగా ఉంటున్న జ్యోతిక కొంత కాలం క్రితం తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. పలు రకాల చిత్రాలు,వెబ్ సిరీస్ లో చేస్తు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల 'డబ్బా కార్టెల్' అనే హిందీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్లో మంచి మార్కులు పొందింది. నయనతార(Nayanthara)ని హీరోయిన్ క్యారక్టర్ కి అడిగితే ఆమె భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మేకర్స్ అయితే ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. చిరు మూవీని అనిల్ రావిపూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవిలో ఇంతకు ముందు ఎవరు చూడని కామెడీ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. బాలకృష్ణతో(Balakrishna)భగవంత్ కేసరిని నిర్మించిన 'సాహు గారపాటి' చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.


హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.