English | Telugu
మహిళల గౌరవం కాపాడండి.. లోక్ సభలో గళమెత్తిన బైరెడ్డి శబరి
Updated : Jul 30, 2025
ఏపీలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యాలు చేయడం లైంగిక దాడితో సమానమన్నారు. ప్రజాసేవలో ఉన్న మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు సమంజనం కాదన్నారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వేసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో గళమెత్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, 33 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న తరుణంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజాసేవలో ఉండటం.. మహిళా నేతలకు శిక్ష కారాదన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రాజకీయాల్లో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆమె స్పీకర్‌ను కోరారు.