English | Telugu
విజయ్ - వంశీ చిత్రానికి ముహూర్తం ఫిక్స్!?
Updated : Mar 19, 2022
కోలీవుడ్ స్టార్ విజయ్ తాజా చిత్రం `బీస్ట్` వేసవిలో విడుదలకు సిద్ధమైంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల తేదిపై స్పష్టత రాబోతోంది.
ఇదిలా ఉంటే, `బీస్ట్` విడుదలయ్యే లోపే విజయ్ తన నెక్స్ట్ వెంచర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారట. టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కోసం విజయ్ కెరీర్ బెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని బజ్. అలాగే, ఇందులో విజయ్ కి జంటగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న దర్శనమివ్వనుందని ప్రచారం జరుగుతోంది.
కాగా, విజయ్ - వంశీ పైడిపల్లి కాంబో మూవీకి సంబంధించిన చిత్రీకరణ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుందట. ఇందులో భాగంగా.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్న భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ జరుగుబోతోందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `మహర్షి` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత రాబోతున్న ఈ సినిమాతోనూ వంశీ పైడిపల్లి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.