English | Telugu
తారక్‌కి ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి?
Updated : Jun 15, 2021
`మాస్టర్`, `ఉప్పెన` చిత్రాల్లో ప్రతినాయకుడిగా అలరించారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. త్వరలో ఈ టాలెంటెడ్ కోలీవుడ్ స్టార్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని ఢీ కొట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కథానాయకుడి పాత్రకి ధీటుగా ఉండే ప్రతినాయకుడి పాత్ర కావడంతో సేతుపతి కూడా ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. త్వరలోనే `ఎన్టీఆర్ 31`లో విజయ్ సేతుపతి ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, తారక్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్నారు. ఆపై కొరటాల శివ దర్శకత్వంలో `ఎన్టీఆర్ 30` చేయబోతున్నారు. అది పూర్తయ్యేలోపే ప్రశాంత్ నీల్ డైరెక్టోరియల్ ని పట్టాలెక్కించనున్నారు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2` విడుదలకు సిద్ధం కాగా.. సెట్స్ పై ఉన్న `సలార్` వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. మరోవైపు విజయ్ సేతుపతి చేతిలో ఏకంగా 14 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ దశలో ఉన్నాయి.
Vijay Sethupathi in Jr NTR and Prashanth Neel film,Vijay Sethupathi to play a pivotal role in Jr NTR Movie,Vijay Sethupathi IN NTR 31