English | Telugu

ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌జ‌న చేస్తున్న వెంకీ!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వాడుకొన్న‌వాళ్ల‌కు వాడుకొన్నంత‌. అందుకే దాదాపుగా ప్ర‌తీ సినిమాలోనూ ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న ఒక్క‌సారైనా తీసుకొచ్చి, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. గురు సినిమాలోనూ ఇదే జ‌రిగింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌జ‌న వేరే స్థాయిలో చూడొచ్చ‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. క‌థ ప్ర‌కారం ఈ సినిమాలోని హీరోయిన్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి వీరాభిమాని. ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌లోని పాట‌ల‌కు డాన్సులు చేస్తుంటుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎర్ర కండువాని త‌ల‌కు చుట్టుకొని త‌న వీరాభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటుంది. లేటెస్ట్‌గా విడుద‌లైన గురు ట్రైల‌ర్‌లో... వీటికి సంబంధించిన షాట్స్ కూడా చూడొచ్చు. వెంకటేష్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే చాలా ఇష్టం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గోపాల గోపాల సినిమా కూడా వ‌చ్చింది. ఆ అభిమాన‌మే గురు సినిమాలోనూ వెంకీ చూపించుకొన్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌వ‌న్ మానియా గురు సినిమాకి ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.