English | Telugu
హీరోయిన్‌ని పెళ్లాడనున్న వరుణ్
Updated : Sep 21, 2015
యంగ్ హీరోగా ఒకప్పుడు దుమ్ము దులిపేశాడు వరుణ్ సందేశ్. హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాలతో ఒక్కసారిగా రేసులోకి వచ్చేశాడు. ఆ రెండు సినిమాల హిట్లతో వరుసగా ఇరవై సినిమాలు చేశాడు. అయితే... అందులో ఒక్క హిట్టూ లేదు. దాంతో వరుణ్ కెరీర్ గ్రాఫ్ ఢామ్మని పడిపోయింది. ఇప్పుడు వరుణ్ పెళ్లిపై దృష్టి పెట్టినట్టు టాక్. హీరోగా మంచి క్రేజ్‌లో ఉండగా వరుణ్ కొన్ని ప్రేమ వ్యవహారాలు నడిపాడు.
శ్రద్దాదాస్‌తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడని అప్పట్లో చెప్పుకొనేవారు. తరవాత వీళ్లిద్దరి బంధం.. బీటలు వారింది. శ్రద్దా తూచ్ చెప్పి వెళ్లిపోయాక... వరుణ్ మరో కథానాయికకతో సన్నిహితంగా మెలగడం మొదలెట్టాడు. ఆ హీరోయిన్‌నే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్.
వరుణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. చేతిలో సినిమాలేం లేవు. అక్కడి నుంచి తిరిగొచ్చాక తన ప్రేమ, పెళ్లి విషయాలపై బయటపడతాడని సమాచారం. వరుణ్ మనసు దోచిన ఆ కథానాయిక ఎవరో తెలియాలంటే.. వరుణ్ అమెరికా నుంచి రావల్సిందే.