English | Telugu

వైష్ణ‌వ్ తేజ్ తో వెంకీ కుడుముల‌?

`ఛ‌లో`(2018), `భీష్మ‌` (2020) చిత్రాల‌తో దర్శ‌కుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకున్నాడు వెంకీ కుడుముల‌. కాగా, `భీష్మ‌` విడుద‌లై ఏడాది దాటినా వెంకీ కొత్త చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. ప‌లువురు స్టార్ హీరోల కాంబినేష‌న్స్ లో వెంకీ పేరు వినిపించినా.. అవి ప్ర‌చారానికే ప‌రిమిత‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ లో వెంకీ పేరు వినిపిస్తోంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఉప్పెన‌`తో సెన్సేష‌న‌ల్ డెబ్యూ ఇచ్చిన మెగా కాంపౌండ్ యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ తో వెంకీ కుడుముల త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని చేయ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే వైష్ణ‌వ్ మేన‌మామ‌, మెగాస్టార్ చిరంజీవికి - వైష్ణ‌వ్ కి వెంకీ క‌థ వినిపించాడ‌ని.. ఇద్ద‌రి నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే వైష్ణ‌వ్, వెంకీ కుడుముల కాంబినేష‌న్ మూవీకి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ న‌టించిన పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. అలాగే `అర్జున్ రెడ్డి` త‌మిళ వెర్ష‌న్ (`ఆదిత్య వ‌ర్మ‌`) ద‌ర్శ‌కుడు గిరీశ‌య్యతో ఇటీవ‌లే ఓ సినిమాని ప‌ట్టాలెక్కించాడు వైష్ణ‌వ్. అదేవిధంగా కింగ్ నాగార్జున నిర్మాణంలో ఓ సినిమా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ లో మ‌రో రెండు చిత్రాల‌ను కూడా వైష్ణ‌వ్ చేయ‌బోతున్నాడు.