English | Telugu

పవర్‌స్టార్‌తో కన్నింగ్ గేమ్..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌‌కళ్యాణ్ ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సైలెంట్‌గా జరుగుతోంది. తన సినిమాల్లోని ప్రతీ ఫ్రేమ్‌ను భారీ స్టార్ క్యాస్టింగ్‌తో నింపేస్తాడు త్రివిక్రమ్. దీనికి తగ్గట్టుగానే పవన్ మూవీలో కూడా చాలా మంది స్టార్స్ కనిపిస్తారట. ఇప్పటికే ఒకప్పటి సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఓ కీ రోల్‌లో నటిస్తోంది. తాజాగా ఆమెకు జతగా మరో సీనియర్ బ్యూటీ వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు ఇంద్రజ. ఈ మూవీలో ఇంద్రజ పవన్‌కు ఆంటీగా కనిపిస్తుందట. ఈ క్యారెక్టర్ కాస్త కన్నింగ్‌గా ఉంటుందట. సెకండ్ ఇన్నింగ్స్‌లో అక్క, తల్లి పాత్రలు చేస్తున్నప్పటికీ అంత నేమ్, ఫేమ్ రాలేదు..ఈ సినిమాలో కనుక ఆమె క్యారెక్టర్ హిట్ అయితే ఇక ఇంద్రజ వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.