English | Telugu

స‌మంత‌కు షాకిచ్చిన త్రివిక్ర‌మ్‌

స‌మంత‌కు షాకుల మీద షాకులు త‌గులతున్నాయ్‌. టాలీవుడ్‌లో స‌మంత ప్ర‌భావం దాదాపుగా త‌గ్గుమొఖం ప‌డుతోంది. దానికి తోడు.. ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాలో గ‌ట్టి షాక్ ఎదురైంది. నితిన్, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి అఆ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. స‌మంత‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు.

ఇప్పుడు మ‌రో క‌థానాయిక కూడా ఎంట్రీ ఇచ్చింది. తానెవ‌రో కాదు, మ‌ల‌యాళం ప్రేమ‌మ్‌తో అంద‌రి దృష్టిలో ప‌డిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. అ ఆలో అనుప‌మ‌ని సెకండ్ హీరోయిన్‌గానే తీసుకొన్నారు. అయితే క్ర‌మంగా అనుపమ క్యారెక్ట‌ర్ పెంచుతూ.. స‌మంత ప్రాధాన్యం త‌గ్గిస్తూ వ‌స్తున్నాడ‌ట త్రివిక్ర‌మ్‌. అనుప‌మ‌ది ఫ్రెష్ ఫేస్‌, దానికి తోడు స‌మంత కంటే మంచి పెర్‌ఫార్మ‌ర్ అన్న‌ది త్రివిక్ర‌మ్ అభిప్రాయం.

అందుకే స‌మంత క్యారెక్ట‌ర్‌కి రాసుకొన్న సీన్లు కూడా ఇప్పుడు అనుప‌మ‌కి షిఫ్ట్ చేసేశాడ‌ట‌. దాంతో అనుప‌మ ఫ‌స్ట్ హీరోయిన్ అయిపోయింది. స‌మంత సెకండ్ ప్లేస్ లోకి ఫిఫ్ట‌య్యింది. ఈ హ‌ఠాత్ ప‌రిమాణానికి స‌మంత షాకైపోయింద‌ట‌. చేసేదేం లేక‌.. గ‌ప్‌చుప్‌గా ఉంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. మొత్తానికి కొత్త అమ్మాయి... స‌మంత‌కు ఎస‌రెట్టేసింద‌న్న‌మాట‌.