English | Telugu
సమంత కాదు..ఆ హీరోయిన్ పై సస్పెన్స్!!
Updated : Jun 19, 2015
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందించిన త్రివిక్రమ్ కి స్టార్ హీరోల డెట్లు దొరక్కపోవడంతో..ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే అందరూ సమంత హీరోయిన్ అయి వుంటుందని అనుకున్నారు. కానీ సమంత అలాంటిదేం లేదని తేల్చి చెప్పేయడంతో ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది. స్టార్ ఇమేజ్ లేకుండా త్రివిక్రమ్ ఏ హీరోయిన్ ని తీసుకోరు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరై వుంటారు? అన్నది ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. మరి ఆ చాన్స్ ఓ ముద్దుగుమ్మను వరించనుందో?