English | Telugu

భరత్ మరణం ఎన్టీఆర్‌కు బిగ్‌"లాసే"నా..?

ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో తెలియదు..ఒక్క చిన్న సంఘటన కొన్ని జీవితాలను బజారు పడేస్తే..అదే ఘటన కొందరిని అందలం ఎక్కిస్తుంది. హిందీలో సూపర్‌హిట్ అయిన బిగ్‌బాస్ షోను తెలుగులో ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా అనుకుంటున్న రోజులవి..జూనియర్ యాంకర్‌గా సరే మరి పార్టిసిపెంట్స్ ఎవరా అని తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్‌లో విపరీతమైన చర్చ నడిచింది. మీడియాలో పుకార్లు కావొచ్చు..ఫిలింనగర్‌లో చర్చల ద్వారా కానీ కొందరి పేర్లు బయటకు వచ్చాయి..వారిలో ఒకరు హీరో రవితేజ తమ్ముడు భరత్ రాజు..అయితే సరిగ్గా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో భరత్ మరణించాడు.

దీంతో బిగ్‌బాస్ షో పార్టిసిపెంట్స్ తుది ఎంపికలో కన్‌ఫ్యూజన్ ఎదురైంది. లాస్ట్‌ మినిట్‌లో భరత్ ప్లేస్‌‌లో ఎవరిని తీసుకోవాలా అని నిర్వాహకులు తలలు పట్టుకున్నారు..దీంతో యువనటుడు ప్రిన్స్‌‌ని తీసుకున్నారు. సాధారణంగా బిగ్‌బాస్ లాంటి రియాల్టీ షోలలో పార్టిసిపేట్స్‌‌ని రెండు రకాలుగా తీసుకుంటారు ఒకరు వివాదాస్పద వ్యక్తులు, రెండు హాట్ హాట్ ముద్దుగుమ్మలు..వీరిలో మొదటి రకం వ్యక్తి భరత్ రాజు. గతంలో డ్రగ్స్‌ వాడకం, దురుసు ప్రవర్తన వంటి కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చాడు భరత్..అటువంటి వ్యక్తి బిగ్‌బాస్ షోలో ఉంటే ఆ మజానే వేరు..ఇక ఆయన స్థానంలో వచ్చిన ప్రిన్స్ చిన్న హీరో. ప్రిన్స్‌తో సహా ఉన్న మిగతా పార్టిసిపేంట్స్‌ పెద్దగా ఫేమ్ ఉన్నవారు కాదు..ఇప్పటికే కంటిస్టెంట్స్ మీద పలువురు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షోను నెట్టుకురావడం ఎన్టీఆర్‌కు కష్టమేనంటున్నారు టాలీవుడ్ జనాలు.