English | Telugu

బావ‌గారు బాగున్నారా సినిమాని ఎత్తేశారా??

ఈమధ్య లీకేజీల ప‌ర్వం గ‌ట్టిగానే న‌డుస్తోంది. ఆడియో రిలీజ్‌కి ముందే పాట‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. కొన్ని సీన్లూ లీక‌యిపోతున్నాయి. వాటిలో భాగంగానే... సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే క‌థేంటో చూచాయిగా తెలిసిపోతోంది. మొన్న‌టికి మొన్న అల్లు అర్జున్ న‌టిస్తున్న కొత్త సినిమా దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ క‌థ ఇదీ.. అని ముందే లీక్ చేసేశారు. ఇప్పుడు మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా `మిస్ట‌ర్` క‌థ కూడా లీక్ అయిపోయింది. క‌థ ప్ర‌కారం.. హీరో విదేశాల్లో ఉంటాడు. అక్క‌డ ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. త‌న నుంచి త‌ప్పించుకొని ఇండియా వ‌స్తాడు. ఇక్క‌డ మ‌రో హీరోయిన్ ప‌రిచ‌యం అవుతుంది. త‌నేదే ఇబ్బందుల్లో ఉంటే కాపాడ‌తాడు హీరో. అయితే ఇంట్ర‌వెల్ స‌మ‌యానికి హీరోయిన్‌ని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. వాళ్లెవ‌రో తెలుసుకోవ‌డానికి విల‌న్ ఇంట్లో అడుగుపెడ‌తాడు హీరో. అక్క‌డి నుంచి క‌థ మ‌లుపులు తిరుగుతుంటుంది. అదే ఇంటికి ఫారెన్‌లో ల‌వ్ చేసిన అమ్మాయి కూడా దిగిపోతుంది. ఈ ఇద్ద‌ర‌మ్మాయిల మ‌ధ్య ఎలా ఇరుక్కున్నాడు? అస‌లు హీరోయిన్‌ని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అనేదే మిగిలిన క‌థ‌. లైన్ చూస్తుంటే బావ‌గారు బాగున్నారా సినిమాని మ‌రోసారి కాపీ కొట్టిన‌ట్టే అనిపిస్తోంది. అందులోనూ అంతే క‌దా?? హీరోయిన్‌ని కాపాడ‌బోయి ఇరుక్కొంటాడు హీరో. సేమ్ ఇక్క‌డా అదే జ‌రుగుతోంది. ఈ కాపీ క‌థ ప‌ట్టుకొని శ్రీ‌నువైట్ల ఎలా హిట్టు కొట్టేస్తాడో ఏంటో..??