English | Telugu

మీడియాతో పెట్టుకొన్నాడు.. బుక్క‌యిపోయాడు!

ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే.. మీడియా ద‌గ్గ‌ర కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఎందుకంటే... ఓ న‌టుడ్ని స్టార్ చేసే సత్తా, స్టార్ తోక‌ల్ని క‌త్తిరించి కింద‌కు దించే స్టామినా మీడియాకే ఉంది. చేతిలో హిట్స్ ఉన్నాయి క‌దా, ఆఫ‌ర్లు ఎగ‌బ‌డుతున్నాయి క‌దా... మీడియానే గ్రిప్పులోకి తీసుకొందాం అంటే... త‌ల బొప్పి క‌ట్ట‌డం ఖాయం. ఈ విష‌యం రాజ్ త‌రుణ్‌కి బాగానే అర్థ‌మైంది. ఈ కుర్ర హీరోపై మీడియాలో బోల్డన్ని రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. ఆఖరికి యాంక‌ర్ లాస్య‌తో ల‌వ్ మేట‌ర్ న‌డుపుతున్నాడ‌న్న విష‌యం కూడా మీడియా ద్వారా లీకైంది. అయితే ఆ త‌ర‌వాత లాస్య వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో ఆ విష‌యం అప్ప‌టితో క్లోజ్ అయ్యింది.

ఓ నిర్మాత రాజ్ త‌రుణ్‌కి విల్లా కొనిచ్చాడ‌ని, ద‌ర్శ‌కుల విష‌యంలో రాజ్‌ త‌రుణ్ విప‌రీతంగా జోక్యం చేసుకొంటున్నాడ‌ని ఇలా ర‌క‌ర‌కాల గాసిప్పులు గుప్పుమంటున్నాయి. వీటన్నింటికీ కార‌ణం.. మీడియాకి త‌న‌పై ఉన్న కోప‌మే అంటున్నాడు రాజ్ త‌రుణ్‌. ఓసారి మీడియాని ఇంట‌ర్వ్యూకి పిలిచి చాలా ఆల‌స్యంగా వెళ్లాడ‌ట రాజ్ త‌రుణ్‌. జ‌ర్న‌లిస్టుల్ని రెండు గంట‌ల పాటు ఎదురుచూసేలా చేసినందుకే.. త‌న‌పై ఇలా రూమ‌ర్లు వ‌స్తున్నాయని ఫీలైపోతున్నాడు. మీడియాతో జాగ్ర‌త్త‌గా ఉండాలన్న విష‌యం బోధ‌ప‌డింద‌ని, ఇక మీద‌ట‌.. చెప్పిన టైమ్‌కే వ‌స్తాన‌ని మాటిస్తున్నాడు రాజ్‌త‌రుణ్‌. ఇక‌మీద‌టైనా మీడియా ముందు తోక జాడించ‌కుండా ఉంటాడేమో చూద్దాం.