English | Telugu
బాలయ్య వస్తాడని, ఎన్టీఆర్‌ని పిలవలేదు
Updated : Sep 20, 2016
మోహన్ బాబు 40 వసంతాల వేడుక విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేష్, దాసరిలాంటి ప్రముఖులు వచ్చారు. నందమూరి బాలకృష్ణ కూడా వస్తాడనుకొన్నారంతా. ఎందుకంటే మోహన్ బాబు కుటుంబానికీ, మంచు కుటుంబానికీ ఉన్న అనుబంధం అలాంటిది. మోహన్ బాబు స్వయంగా వెళ్లి బాలయ్యని ఆహ్వానించాడు కూడా. అయితే.. షూటింగ్ హడావుడిలో ఉండడం వల్ల బాలయ్య రాలేకపోయాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కూడా కనిపించలేదు. నిజానికి అసలు ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందలేదట. దానికి కారణం బాలయ్యే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాలయ్యకు, ఎన్టీఆర్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఎలాగూ నా ఫంక్షన్‌కి వస్తాడు.. అదే వేడుకలో ఎన్టీఆర్ ఉంటే.. కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పైగా బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు సభలో గందరగోళం సృష్టించే ప్రమాదం ఉందని భావించిన మోహన్ బాబు .. ఎన్టీఆర్‌ని పిలవలేదని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ వస్తాడని చెబితే.. బాలయ్య, బాలయ్య వస్తాడని తెలిస్తే ఎన్టీఆర్ ఈ ఫంక్షన్‌కి డుమ్మా కొడతారని.. బాలయ్యకే ఫిక్సయిపోయాడట మోహన్ బాబు. చివరాఖరికి బాలయ్య కూడా ఈ వేడుకకు రాలేదు. అలా నందమూరి హీరోలు లేక.. ఈ ఫంక్షన్ కాస్త కళ తప్పినట్టైంది.