English | Telugu
రాధికా ఆప్టేని రూమ్‌కి రమ్మన హీరో ఎవరు??
Updated : Sep 21, 2016
రాధికా ఆప్టే... ఇప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్స్. ఈ మధ్య యూట్యూబ్‌లో విడుదల చేసిన ఓ న్యూడ్ వీడియో... సౌత్ ఇండియన్ సినిమా మొత్తానికి గట్టి షాక్ ఇచ్చింది. అంతకు ముందు రాధికా అర్థనగ్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది రాధిక. తనని ఓ సౌత్ ఇండియన్ హీరో రూమ్ కి రమ్మన్నాడని, అసభ్యంగా మాట్లాడాడనికి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆ హీరో ఎవర్నది మాత్రం చెప్పలేదు.
తెలుగులో రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది రాధిక. తమిళంలో రజనీ సరసన కబాలిలో కనిపించింది. ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కథానాయికలంటే అవకాశాల కోసం ఏ పని చేయడానికైనా సిద్దంగా ఉంటారనుకొంటారని, అయితే అందరూ అలాంటివాళ్లు కాదని, తనలాంటివాళ్లు కూడా ఉంటారని చెబుతోంది రాధికా. ఓ హీరో తనని రూమ్‌కి రమ్మన్నాడని, అయితే తను గట్టిగా సమాధానం చెప్పానని, తన ముందు ఇంకెప్పుడూ అలాంటి ప్రస్తావన తీసుకురాలేదని ఇంటోంది రాధిక. ఆ హీరో ఎవరో అంటూ... దక్షిణాదిన పెద్ద చర్చ మొదలైంది. ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి కథానాయికలకు చాలా ధైర్యం ఉండాలి. ఈ విషయంలో రాధిక గ్రేటే.