English | Telugu

నిర్మాతను విలన్ గా మార్చిన డైరెక్టర్

టాలీవుడ్ లో ప్రయెగాలు చేయడం తేజ‌కు బాగా అల‌వాటు. ఏమాత్రం అనుభ‌వం లేని న‌టీన‌టుల‌తో అద్భుతాలు సృష్టించాల‌నుకొంటాడాయ‌న‌. తాజాగా అలాంటి ప్ర‌యోగ‌మే చేస్తున్నాడు. అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో తేజ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని ఓ నిర్మాత‌కు అప్ప‌గించిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. మిస్ట‌ర్ నోకియా, మేం వ‌య‌సుకు వ‌చ్చాం, పిల్ల‌జ‌మిందార్ చిత్రాల నిర్మాత డి.ఎస్‌.రావుకి విల‌న్ వేషం ఇచ్చాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ నిర్మాత‌గా సుప‌రిచితుడైన రావ్‌.. ఇప్పుడు వెండి తెర‌పై క‌నిపించ‌బోతున్నాడ‌న్న‌మాట‌. రావ్ చేత ఓ విభిన్న‌మైన గెట‌ప్ వేయించేందుకు సన్న‌ద్ధుడ‌వుతున్నాడు తేజ‌. మ‌రి ఆయ‌న చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ ఫ‌లితం అందిస్తుందో చూడాలి.