English | Telugu
సూపర్ స్టార్ విడాకులు..19 కోట్లు..!!
Updated : Sep 12, 2015
కన్నడ సూపర్ స్టార్, ఈగ సినిమాతో తెలుగువారికీ చేరువైన సుదీప్.. తన భార్య ప్రియ రాధాకృష్ణన్ నుంచి విడాకులు తీసుకుంటున్నాడు. ఇందుకోసం అతను భరణం కింద రూ.19 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో శుక్రవారం విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరికీ అంగీకారమే కాబట్టి త్వరలోనే విడాకులు మంజూరయ్యే అవకాశముంది. ఐతే సుదీప్ కు వేరే అఫైర్లు కూడా ఏమీ లేవు. పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టేందుకు, తనతో తాను గడపడం కోసం విడాకులు తీసుకుంటున్నట్లు సుదీప్ ట్విట్టర్లో వెల్లడించాడు. మిగతా వాళ్లలాగా అంతా గోప్యంగా చేయకుండా.. అభిమానులకు విషయమంతా పూసగుచ్చినట్లు వివరించి మరీ విడాకులు తీసుకుంటున్నాడు సుదీప్. దీంతో ప్రకాష్ రాజ్, ప్రభుదేవా వంటి దిగ్గజాల బాటలోనే సుదీప్ కూడా భార్యకు విడాకులిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.