English | Telugu

ఫ్లాప్ అయితే సునీల్ డ‌బ్బులివ్వాలా??



త‌న సినిమాల విష‌యంలో సునీల్ విప‌రీతంగా జోక్యం చేసుకొంటాడ‌న్న‌ది.. ఫిల్మ్‌న‌గ‌ర్ వాసులు ముందు నుంచీ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. పాత సినిమాల డీవీడీల‌న్నీ ఇచ్చి సీన్లు త‌యారుచేయ‌మంటాడ‌ని, సెట్లో ద‌ర్శ‌కుల్ని ప‌ని చేసుకోనివ్వ‌డ‌ని బోల్డన్ని రూమ‌ర్లున్నాయి. ఆఖ‌రికి దిల్‌రాజు సినిమాలోనూ ఇదే సీన్ రిపీట్ చేశాడ‌ట‌. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో సునీల్ న‌టించిన సినిమా కృష్ణాష్ట‌మి. ఈనెల 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. రెండేళ్లుగా సునీల్ ఖాతాలో సినిమా లేదు. ఈ సినిమా అటూ ఇటూ అయితే హీరోగా సునీల్‌ని మ‌ర్చిపోవొచ్చు. అందుకే. ఈ సినిమా లిజ‌ల్ట్ ప‌ట్ల సునీల్ చాలా సీరియ‌స్‌గా ఉన్నాడ‌ట‌. ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని త‌న సినిమాకి ఇష్ట‌మొచ్చిన రీతిలో క‌త్తెర్లు వేసుకొన్నాడ‌ని టాక్‌. సాధార‌ణంగా దిల్‌రాజు సినిమా అంటే ఆయ‌నిదే ఆధిపత్యం.

ప్ర‌తి ఫ్రేమూ త‌న‌కు అనుగుణంగా ఉండాల్సిందే. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌రా... ఆయ‌న‌దే హ‌వా. అయితే.. కృష్టాష్ట‌మి విష‌యంలో సీన్ రివ‌ర్స్ అయ్యింద‌ట‌. దిల్‌రాజుకి కూడా చెప్ప‌కుండా.. కృష్ణాష్ట‌మి సినిమాని త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఎడిటింగ్ చేసుకొన్నాడ‌ని, గౌత‌మ్‌రాజు మాట కూడా విన‌లేద‌ని.. దాంతో దిల్‌రాజు సునీల్‌పై సీరియ‌స్ అయ్యాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఈ విష‌యంలో సునీల్‌కీ దిల్‌రాజుకీ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ట‌. 'సినిమా ఫ్లాప్ అయితే నువ్వు డ‌బ్బులిస్తావా?' అని దిల్‌రాజు సునీల్‌ని గ‌ట్టిగా ఆడిగాడ‌ట‌. దాంతో సునీల్ కూడా మాట్లాడ‌లేక‌పోయాడ‌ని, `ఇలాగైతే ప్ర‌మోష‌న్లకు కూడా రాను` అని దిల్‌రాజుతో తెగేసి చెప్పాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినిమా విడుద‌ల‌కు ముందు నిర్మాత‌, క‌థానాయ‌కుడి మ‌ధ్య పోరు ప‌డ‌లేక ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ కూడా సైలెంట్ అయిపోయాడ‌ట‌. మ‌రి మున్ముందు ఇంకెన్ని గొడ‌వ‌లొస్తాయో?