English | Telugu

ఎదిగే టైంలో ఈ పాడు పనులేంటీ..?

సినిమాల్లో పనిచేసే వాళ్లకి లేని అలవాటు ఉండదని పిల్లనివ్వడానికి భయపడే వాళ్లు ఇప్పటికీ ఉన్నారంటే మీరు నమ్ముతారా.? రెండు చేతులా సంపాదిస్తున్నా.. కోట్ల ఆస్తులున్నా గానీ తమ ఇంటి పిల్లను ఇవ్వడానికి తల్లిదండ్రులు భయపడటానికి కారణాలు అనేకం. అవేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాముడి లాంటి వ్యక్తినైనా సరే.. ఇక్కడి పరిస్థితులు మార్చేస్తాయని అంటుంటారు. ఈ ఎట్రాక్షన్‌లకు.. స్నేహాలు తోడై పండంటి కాపురాలను నాశనం చేసుకున్న వారు ఫిలింనగర్‌లో అడుగడుగునా కనిపిస్తారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. డివైడ్ టాక్ వచ్చినా తన నటనతో సినిమాను గట్టెక్కించగలడని.. మినిమమ్ బడ్జెట్‌తో తీసిన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించగలడని పేరున్న ఒక హీరో.. తనతోటి హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నాడట.. అది కాస్తా హీరోగారి భార్యకు తెలియడంతో.. ఆమె తన తల్లిదండ్రుల సమక్షంలో పెద్ద పంచాయతీ పెట్టించిందట. జరిగిందేదో జరిగిపోయింది.. ఇక నుంచి బుద్దిగా ఉంటానని చెప్పినప్పటికీ.. ప్రియురాలిని వదులుకోలేక భార్యతో సన్నిహితంగా ఉండలేక సదరు హీరోగారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడట. ఇప్పుడు ఫిలింనగర్‌లో ఏ నలుగురు కలిసినా హీరోగారి యవ్వారంపైనే మాట్లాకుంటున్నారట.. ఎదిగే టైంలో ఇలాంటి పాడు పనులేంటి అంటూ వారు ముక్కున వేలేసుకుంటున్నారట.