English | Telugu

రాజ‌మౌళి బ‌ల‌హీన‌త బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భాస్‌

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి గురించి ఎవ‌రైనా గొప్ప‌గానే చెబుతారు. ఆయ‌న‌కు తిరుగులేద‌ని, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయ‌డంలో రాజ‌మౌళి కంటే గొప్ప ద‌ర్శ‌కుడు దేశం మొత్తమ్మీద లేడ‌ని గ‌ర్వంగా మాట్లాడ‌తారు. రాజ‌మౌళి రౌద్ర‌ర‌సం అద్భుతంగా పండిస్తాడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఇక చెప్ప‌క్క‌ర్లేద్దు. ఎమోష‌న్ కంటెంట్‌లో తిరుగులేదు. అయితే.. రాజ‌మౌళిలో ఒకే ఒక్క మైన‌స్ ఉంది. రొమాంటిక్ స‌న్నివేశాల్ని రాజ‌మౌళి స‌రిగా తీయ‌లేడ‌ట‌. ఈ మాట‌ స్వ‌యంగా ప్ర‌భాస్ నోటి నుంచే రావ‌డం విశేషం. ఇదే విష‌యంలో ప్ర‌భాస్ రాజ‌మౌళితో చాలా సార్లు చెప్పాడ‌ట‌.

డార్లింగ్ నువ్‌.. రొమాన్స్ తీయ‌డంలో వీక్‌.. అదొక్క‌టీ స‌రి చేసుకో అనేవాడ‌ట‌. అయితే బాహుబ‌లి 2లో ఆ విష‌యంలోనూ రాజ‌మౌళి త‌న‌దైన మార్క్ చూపించాడ‌ని ప్ర‌భాస్ చెబుతున్నాడు. ఓ రెండు షాట్స్ చూశాక‌... రాజ‌మౌళి కి రొమాన్స్‌లోనూ తిరుగులేద‌ని అనిపించింద‌ని, ఇక రాజ‌మౌళిలో మైన‌స్‌లంటూ లేవ‌ని ప్ర‌భాస్ కితాబు ఇచ్చేశాడు. ప్ర‌భాసే ఇంత ఇదిగా చెబుతున్నాడంటే.. బాహుబ‌లి 2లో రొమాన్స్‌ని రాజ‌మౌళి ఏ స్థాయిలో పండించాడో అనే ఆస‌క్తి మొద‌లైంది. ఈసారి అనుష్క‌ని రాజ‌మౌళి గ్లామ‌రెస్‌గా చూపించాడ‌ని, ఓ పాట‌లో అనుష్క ని రొమాంటిక్ యాంగిల్ లో ప్ర‌జెంట్ చేశాడ‌ని, అందుకే ప్ర‌భాస్ ఇలా రియాక్ట్ అయ్యాడ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రిగిందో తెలియాలంటే బాహుబ‌లి 2 వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి.